సుకుమార్ కు పోటీ బాగానే పెరిగింది

మొన్నటివరకు అస్సలు డిమాండ్ లేని దర్శకుడు. కానీ నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు సుకుమార్. ప్రస్తుతం అతడితో సినిమా చేసేందుకు చాలామంది హీరోలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే నాగార్జున… సుక్కూ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అఖిల్ తో సినిమా చేయమని ఫోర్స్ చేస్తున్నాడు. తాజాగా ఈ జాబితాలో రామ్ చరణ్ కూడా చేరిపోయాడు. సుకుమార్ దర్శకత్వంలో, రామ్ చరణ్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు బండ్ల గణేశ్ ప్రయత్నిస్తున్నాడని సమాచారం. ఈమధ్య కాలంలో కాస్త స్తబ్దుగా ఉన్న ఈ నిర్మాత… ఇప్పుడు చెర్రీ-సుక్కూతో కలిసి భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సుకుమార్ మాత్రం ఇప్పటికే దేవిశ్రీప్రసాద్ హీరోగా ఓ సినిమా చేసేందుకు కమిటయ్యాడు. మరి దేవీతోనే అతడు సెట్స్ పైకి వెళ్తాడా… లేక అఖిల్ కోసం దేవిశ్రీని పక్కనపెడతాడా అనేది చూడాల్సి ఉంది. రామ్ చరణ్ మాత్రం సుకుమార్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నాడట. సురేందర్ రెడ్డితో సినిమా కంప్లీట్ అయిన వెంటనే… సుక్కూతో కలిసి సెట్స్ పైకి వెళ్లేలా… ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడట. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here