Telugu Global
National

కేంద్ర ఉద్యోగులకు ' ఫ్రీ యోగా' క్లాసులు

వచ్చేనెల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది కేంద్రం, సిబ్బంది వ్యవహారాల శిక్షణ శాఖ వచ్చేనెల 1వ తేదీ నుంచి యోగా శిక్షణ తరగతులు ప్రారంభించనుంది. ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో తప్ప మిగిలిన అన్ని రోజుల్లోను ఢిల్లీలోని మురార్జీ దేశాయ్‌ జాతీయ యోగా కేంద్రం సహకారంతో ఈ తరగతులను నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా 31 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు లబ్ధి […]

కేంద్ర ఉద్యోగులకు  ఫ్రీ యోగా క్లాసులు
X

వచ్చేనెల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది కేంద్రం, సిబ్బంది వ్యవహారాల శిక్షణ శాఖ వచ్చేనెల 1వ తేదీ నుంచి యోగా శిక్షణ తరగతులు ప్రారంభించనుంది. ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో తప్ప మిగిలిన అన్ని రోజుల్లోను ఢిల్లీలోని మురార్జీ దేశాయ్‌ జాతీయ యోగా కేంద్రం సహకారంతో ఈ తరగతులను నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా 31 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూర్చే ఈ శిక్షణ తరగతులకు రిజిస్ర్టేషన్‌ చేసుకోవలసిన అవసరం లేదు. అలాగే దీనికి ఎలాంటి రుసుములు కూడా వసూలు చేయరు. సంప్రదాయ వైద్యాన్ని, యోగ వంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి గత యేడాది అమెరికా పర్యటనలో ఉండగా అంతర్జాతీయ వ్యాప్తంగా ‘యోగా దినం’ పాటించాలని పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ గత డిసెంబర్‌లో ఒక ప్రకటన చేస్తూ జూన్‌ 21 “యోగ దినం’గా పాటించాలని పిలుపునిచ్చింది. కేబినెట్‌ సెక్రటరీలతోపాటు సీనియర్‌ అధికారులు వత్తిడి నుంచి ఎలా బయటపడాలన్న అంశంపై సిబ్బంది వ్యవహారాల శిక్షణ శాఖ ఈనెల 28 నుంచి రెండు రోజులపాటు వర్క్‌షాపు నిర్వహిస్తుంది.

First Published:  20 March 2015 12:07 PM GMT
Next Story