Telugu Global
NEWS

ప్రాణహిత ప్రాజెక్ట్‌కు కాళేశ్వరంగా పేరు మార్పు!

తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు పేరును మార్పు చేస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వంతో పేచీ లేకుండా ఈ ప్రాజెక్టును కరీంనగర్‌ జిల్లా కాళేశ్వరం వద్ద నిర్మించాలని ప్రతిపాదిస్తోంది. దీనికి మహారాష్ట్ర ఆమోదం తెలిపినప్పటికీ ముంపు ప్రాంతాన్ని తగ్గించాలంటూ కొర్రీ పెట్టింది. ఈ గొడవంతా ఎందుకనుకున్న కేసీఆర్‌ ప్రభుత్వం అసలు అక్కడ కాకుండా ప్రాజెక్టు ప్రాంతాన్నే మార్చాలని తలపెట్టింది. ప్రసిద్ధ శైవ క్షేత్రం కాళేశ్వరం వద్ద నిర్మించడం వల్ల అన్ని విధాలుగా మేలు జరుగుతుందని భావిస్తోంది. దీని పేరును కూడా […]

ప్రాణహిత ప్రాజెక్ట్‌కు కాళేశ్వరంగా పేరు మార్పు!
X

తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు పేరును మార్పు చేస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వంతో పేచీ లేకుండా ఈ ప్రాజెక్టును కరీంనగర్‌ జిల్లా కాళేశ్వరం వద్ద నిర్మించాలని ప్రతిపాదిస్తోంది. దీనికి మహారాష్ట్ర ఆమోదం తెలిపినప్పటికీ ముంపు ప్రాంతాన్ని తగ్గించాలంటూ కొర్రీ పెట్టింది. ఈ గొడవంతా ఎందుకనుకున్న కేసీఆర్‌ ప్రభుత్వం అసలు అక్కడ కాకుండా ప్రాజెక్టు ప్రాంతాన్నే మార్చాలని తలపెట్టింది. ప్రసిద్ధ శైవ క్షేత్రం కాళేశ్వరం వద్ద నిర్మించడం వల్ల అన్ని విధాలుగా మేలు జరుగుతుందని భావిస్తోంది. దీని పేరును కూడా కాళేశ్వరం ప్రాజెక్టుగానే మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నారు. కృష్ణా, గోదావరి నదులపై ప్రతిపాదించిన ప్రాజెక్టులపై అధ్యయనానికి వచ్చే వారం రిటైర్డ్‌ ఇంజినీర్లకు ఒక ప్రత్యేక హెలికాప్టర్‌ ఇచ్చి ఏరియల్‌ సర్వేకు పంపాలని ఆయన యోచిస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతల, నక్కలగండి ఎత్తిపోతల ప్రాజెక్టులకు వచ్చే నెల మొదటి వారంలో శంకుస్థాపన చేయనున్నారు. మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించినప్పుడే తెలంగాణ రాష్ట్ర్రానికి సార్థకత ఏర్పడుతుందన్న అభిప్రాయంతో కేసీఆర్‌ ఉన్నారు. అందుకే రాష్ట్ర్రాన్ని సస్యశ్యామలం చేయాలంటే ఈ రెండు నదులపై చేపట్టే ప్రాజెక్టులన్నీ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

First Published:  21 March 2015 5:08 AM GMT
Next Story