వ్యాపార రంగంలోకి రవిశాస్త్రి!

రవిశాస్త్రి ఇపుడు వ్యాపార రంగంలో అడుగుపెట్టబోతున్నాడు. క్రికెట్‌పై మొహం మొత్తిందో లేక వ్యాపారంపై అభిమానం పుట్టుకొచ్చిందో తెలియదు కాని ఆయన సీరియస్‌గానే వ్యాపారంలో దిగుతున్నారు. వెస్టిండీస్‌తో పోటీకి ముందు ధోనీసేన పెర్త్‌ శివారులో సరదాగా ‘బీచ్‌ వాలీబాల్‌’ ఆడింది. ‘ఇండియా రిసోర్సెస్‌’ లిమిటెడ్‌ అనే సంస్థ ఆ కార్యక్రమాన్ని స్పాన్సర్‌ చేసింది. విషయమేమంటే సంస్థ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌లో రవిశాస్త్రి సభ్యుడు. ఆస్ట్రేలియా స్టాక్‌ ఎక్సేంజీలో లిస్టింగ్‌ అయిన కంపెనీ అది. ప్రపంచకప్పుు క్రికెట్లో భారత జట్టును ముందుండి నడిపిస్తున్న ‘డైరెక్టర్‌’ రవిశాస్త్రి ఇప్పుడు భారత్‌, ఆస్ట్రేలియాల్లో అధికార, వ్యక్తిగత స్థాయిల్లో తనకున్న సత్సంబంధాలను ఉపయోగించుకుని గనుల రంగాలలో పెట్టుబడులు పెట్టనున్నాడన్న మాట. భారత ప్రధాని నరేంద్రమోడీ ‘మేకిన్‌ ఇండియా’ అంటున్నారు. అందుకు రవిశాస్త్రి సైతం ‘సై’ అంటున్నారు. చూద్దాం… రవిశాస్త్రి ఈ రంగంలో ఎంతవరకు రాణిస్తాడో… ముందు మనం ఆయనకు ఆల్‌ది బెస్ట్‌ చెబుదాం!