Telugu Global
NEWS

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సంబరాలు

తెలుగు రాష్ట్రాల్లో మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సర వేడుకలు నిర్వహిస్తుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు జిల్లా అనంతవరంలో ఉగాది ఉత్సవాన్ని జరుపుకుంది. ఇరుచోట్ల జరుగుతున్న కార్యక్రమాలకు ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నారా చంద్రబాబునాయుడు హజరయ్యారు. వేద పండితుల ఆశీర్వాదాల మధ్య ఇరుచోట్లా పంచాగ శ్రవణం జరిగింది. అనంతవరంలో జరిగిన ఉగాది వేడుకలకు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, రావెలతోపాటు […]

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సంబరాలు
X

తెలుగు రాష్ట్రాల్లో మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సర వేడుకలు నిర్వహిస్తుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు జిల్లా అనంతవరంలో ఉగాది ఉత్సవాన్ని జరుపుకుంది. ఇరుచోట్ల జరుగుతున్న కార్యక్రమాలకు ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నారా చంద్రబాబునాయుడు హజరయ్యారు. వేద పండితుల ఆశీర్వాదాల మధ్య ఇరుచోట్లా పంచాగ శ్రవణం జరిగింది. అనంతవరంలో జరిగిన ఉగాది వేడుకలకు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, రావెలతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి భారీ ఎత్తున ప్రజలు కూడా తరలివచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి కేంద్రమంత్రి దత్తాత్రేయ, స్పీకర్‌ మధుసూదనాచారి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. తెలంగాణలో రాణి నరసింహమూర్తి పంచాంగ పఠనం చేశారు. 12 రాశుల వారికి ఈ మన్మధ నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉంటాయో వివరించారు. అలాగే వచ్చే 12 నెలల కాలంలో ఏయే రాశుల వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా పడతాయని, నాయకుల మధ్య వైర భావం ఎక్కువగా ఉంటుందని, దేశాల మధ్య యుద్ధాలు సంభవిస్తాయని ఆయన తెలిపారు. తుల, వృశ్చిక, ధనస్సు రాశుల వారికి ఏలిననాటి శని జరుగుతున్నందున ఎలాంటి పరిహారాలు చేపట్టాలో వివరించారు. ఈ సంవత్సరంలో గోదావరి పుష్కరాలు ఉన్నందున చాలామందిలో వివాహాలు చేయరాదన్న భావన ఉందని, అయితే ఈ ప్రాంతానికి పుష్కర దోషం లేదని, యధావిధిగా పెళ్ళిళ్ళు జరుపుకోవచ్చని తెలిపారు. ఈ మన్మధ నామ సంవత్సరంలో ప్రజలకు, పాలకులకు, కార్మిక, శ్రామికులకు ఆయురారోగ్యములు ఇవ్వాలని ఆకాంక్షింస్తూ దీవెనలు అందించారు.

First Published:  21 March 2015 2:48 AM GMT
Next Story