జర నవ్వండి ప్లీజ్‌-3

>>నాన్న ‘కథలు’
రాత్రి పది గంటలైంది. తల్లీ కొడుకులిద్దరికీ నిద్ర పట్టటం లేదు. కొడుకు అటు ఇటు దొర్లుతూ ”మమ్మీ! నాకు నిద్ర రావడంలేదు. ఏదైనా కథ చెప్పవూ” అని తల్లిని అడిగాడు. కొంచెంసేపు ఆగమ్మా! మీ నాన్నగారొస్తారు. మనిద్దరికీ రకరకాల కథలు వినిపిస్తారు. (ఇంటికి లేటుగా వచ్చినందుకు వినిపించే కథలు)

>>అస్సలు వాడం..

జీవిత : మా ఆయన పవన్‌కల్యాణ్‌, నేను శ్రియ వాడిన సబ్బులు వాడతాం… తెలుసా వదినా!
రాశి : అలాగా! మేం ఒకరు వాడేసిన సబ్బులు అస్సలు వాడం వదినా! మాటల్లేవు

>>”సిన్మాకెళ్దాం వస్తావా? అని పక్కింటావిడ చీటీ రాసి పంపిందేంటి?”
”ఆవిడకూ నాకూ ఈ మధ్య మాటల్లేవులెండి…!”

>>కప్పవి కాదు మనిషివే!
చలేసి దుప్పటి కప్పుకోవటానికి అవస్థ పడుతున్న భర్తతో..
”ఏవండీ…! నేను కప్పనా?” ”కాదు… మనిషివే..!
ఇప్పుడెందుకా అనుమానం వచ్చింది?”

>>సర్దుకున్నాను!
తల్లి : భార్యాభర్తలన్నాక గొడవలైనప్పుడు ఎవరో ఒకరు సర్దుకుపోవాలి.
కూతురు : అందుకేనమ్మా…! మొత్తం సామానంతా సర్దుకొని వచ్చేశాను.