Telugu Global
NEWS

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు

తెలుగు రాష్ట్ర్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తెలంగాణలో రెండు పట్టభద్రుల స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు టీచర్‌ స్థానాలకు ఈ ఎన్నికలు జరిగాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని పట్టభద్ర స్థానానికి జరిగిన ఎన్నికల్లో 39 శాతం, నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో 53 శాతం పోలింగ్‌ జరిగింది. ఈ రెండు చోట్ల జరిగిన ఎన్నికల్లో ఓటర్లు చాలా అనాసక్తిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు కనిపించింది. హైదరాబాద్‌ 27, మహబూబ్‌నగర్‌ 53, రంగారెడ్డి 37, నల్గొండ […]

తెలుగు రాష్ట్ర్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తెలంగాణలో రెండు పట్టభద్రుల స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు టీచర్‌ స్థానాలకు ఈ ఎన్నికలు జరిగాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని పట్టభద్ర స్థానానికి జరిగిన ఎన్నికల్లో 39 శాతం, నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో 53 శాతం పోలింగ్‌ జరిగింది. ఈ రెండు చోట్ల జరిగిన ఎన్నికల్లో ఓటర్లు చాలా అనాసక్తిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు కనిపించింది. హైదరాబాద్‌ 27, మహబూబ్‌నగర్‌ 53, రంగారెడ్డి 37, నల్గొండ 58, ఖమ్మం 49, వరంగల్‌ 53 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఉదయం నుంచి పట్టభద్రులు ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి కనబరిచినట్టు కనిపించలేదు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితా లోపభూయిష్టంగా ఉందని తెలంగాణ భాజాపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండు చేశారు. టీఆర్‌ఎస్‌ సర్కారు అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు చాలా ఆసక్తిగా పాల్గొన్నారు. ఇక్కడ అత్యధికంగా ఓట్ల శాతం నమోదైంది. ఉభయగోదావరి జిల్లాలో 85 శాతం, కృష్ణా 65, గుంటూరు జిల్లాలో 72.5 శాతం ఓటింగ్‌ జరిగింది. ఈ నాలుగు స్థానాల ఓట్ల లెక్కింపు ఈనెల 25వ తేదీన జరుగుతుంది.

First Published:  22 March 2015 7:36 AM GMT
Next Story