బోనాల పోత‌రాజు గా నారాయణమూర్తి

విప్లవ చిత్రాల హీరో పీపుల్స్ స్టార్ ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి క‌థానాయ‌కుడిగా
అల్లాణి శ్రీ‌ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సానాయాదిరెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో బోనాల పోత‌రాజు సినిమా రూపొంద‌నుంది. పోత‌రాజు దేవుడితో స‌మాన మైన వాడు, ఏడు గురు అమ్మ‌వార్ల‌కు త‌మ్ముడు అయి వారిని కాస్తూ ఉంటాడు.పోత‌రాజు సంస్కృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఈ సినిమాలో జాన‌ప‌ద గాధ‌ల‌ను చెపుతూనే ప్ర‌జాసినిమాగా తీర్చి దిద్ద‌నున్నాము.ఈ సినిమాలో ముఖ్యంగా అక్కా త‌మ్ముళ్ల మ‌ధ్య ఉండే ప్రేమాభిమానాల‌ను చూపెడుతున్నాము.ప్ర‌జ‌ల కొర‌కు సినిమా తీస్తూ ప్ర‌జాతార‌గా కీర్తింప‌బ‌డుతున్న ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి గారు ఈ సినిమా కు క‌థ‌ను ఇవ్వ‌డ‌మే కాకుండా పోత‌రాజు పాత్ర‌ను చేస్తున్నాడు. ఏప్రిల్ నెల 15 నుండి సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది జూలై నెల లో అమ్మ‌వారి ఉత్స‌వాల సంద‌ర్భంగా సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.