హర్రర్ సినిమాలో త్రిషా

ఈ మద్య తెలుగులో హర్రర్, త్రిల్లర్ చిత్రాలకు బాగా క్రేజ్ పెరిగింది. ఈ
నేపద్యం లో ఈ తరహా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి సినిమాల్లో
నటించేందుకు హీరోయిన్స్ కుడా ఆసక్తి చూపిస్తున్నారు. లేటెస్ట్ గా క్రేజీ భామ
త్రిష కుడా హారర్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. ప్రస్తుతం త్రిష బాలయ్య
సరసన “లయన్” సినిమాలో నటిస్తుంది. తెలుగులో హర్రర్ నేపద్యం లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇటివలే లవ్ యు బంగారం ఫేమ్ గోపి దర్శకత్వం వహిస్తాడు. ఈ చిత్రాన్ని”లక్ష్మి రావే మా ఇంటికి” చిత్రాన్ని నిర్మించిన గిరిధర్ నిర్మిస్తున్నాడు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంబం కానుంది.