ఈ బంగార్రాజు హంగామా సృష్టిస్తాడా ?

విబిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న కింగ్ అక్కినేని
నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’. రమ్యకృష్ణ,
లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా కళ్యాణ్ కృష్ణ
దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇటీవలే ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను
సుమారు 1500 సంవత్సరాల నాటి గుడిలో కొన్ని సీన్స్ ని షూట్ చేసారు. ఈ సినిమాలో
నాగార్జున పాత్ర రెండు విభిన్న కోణాల్లో ఉంటుంది. అందులో ముఖ్యంగా నాగార్జున
చేసిన బంగార్రాజు పాత్ర ఆడియన్స్ ని బాగా ఎంటర్ టైన్ చేస్తుందని ఈ చిత్ర టీం
అంటోంది. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ మార్చి 22 నుంచి హైదరాబాద్ లో మొదలు
కానుంది. పూర్తి వినోదాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో హంసా నందిని కీలక
పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా పై ట్రేడ్ వర్గాల్లో చాలా ఆసక్తి
నెలకొంది. మరి ఈ సినిమాతో నాగ్ హంగామా క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి !