Telugu Global
Others

జర నవ్వండి ప్లీజ్ 6

కోతి చేష్టలు టీచర్‌: మనిషి కోతి నుంచి వివిధ దశల్లో మానవుడిగా రూపాంతరం చెందాడు. కొన్ని జీవులు ఇంకా రూపాంతరం చెందలేదు. విద్యార్థి: సార్‌! ఆ జీవులు ఎక్కడ ఉన్నాయి? టీచర్‌: మన తరగతి గదిలోనే ఉన్నాయి. అందులో నువ్వూ ఒకడివి! ************ ‘గాడిద’కొడుకు తండ్రి: నన్ను గాడిద అంటావురా వెధవా? కొడుకు: నిన్న నన్ను గాడిదకొడకా.. అన్నావు మరి! ************ నిజంగా అబద్ధం ”అబద్ధాలు చెప్పొద్దని, నీకిప్పటికి పదిసార్లు చెప్పా!” అంటూ కొడుకుని మందలించాడు తండ్రి. […]

కోతి చేష్టలు
టీచర్‌: మనిషి కోతి నుంచి వివిధ దశల్లో మానవుడిగా రూపాంతరం చెందాడు. కొన్ని జీవులు ఇంకా రూపాంతరం చెందలేదు.
విద్యార్థి: సార్‌! ఆ జీవులు ఎక్కడ ఉన్నాయి?
టీచర్‌: మన తరగతి గదిలోనే ఉన్నాయి. అందులో నువ్వూ ఒకడివి!
************
‘గాడిద’కొడుకు
తండ్రి: నన్ను గాడిద అంటావురా వెధవా?
కొడుకు: నిన్న నన్ను గాడిదకొడకా.. అన్నావు మరి!
************
నిజంగా అబద్ధం
”అబద్ధాలు చెప్పొద్దని, నీకిప్పటికి పదిసార్లు చెప్పా!” అంటూ కొడుకుని మందలించాడు తండ్రి.
”నాన్నా మీరే అబద్ధాలు చెబుతున్నారు! మీరు ఇప్పటి వరకు నాకు చెప్పింది రెండుసార్లే” గుర్తు చేశాడు కొడుకు
************
నరకం
ఒక వ్యాపారస్థుడు నరకానికి వెళ్లి అక్కడున్న తలుపు తట్టాడు.
తలుపు తీసిన చిత్రగుప్తుడు అతన్ని చూసి ”నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు?” అన్నాడు.
”నాకు అప్పు పడిన కస్టమర్లు ఇక్కడున్నారు. వసూలు కోసం వచ్చాను” అన్నాడు. ”వాళ్లు ఇక్కడే ఉంటారని నీకెలా తెలుసు?”
వాళ్లెప్పుడూ ”నరకం చూపిస్తున్నావు. అక్కడికే వచ్చి కలెక్టు చేసుకో” అనేవాళ్లు.
************

First Published:  23 March 2015 8:00 AM GMT
Next Story