Telugu Global
NEWS

తెలంగాణ పర్యాటక సంస్థ ఛైర్మన్‌గా పేర్వారం

తెలంగాణ తొలి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ పేర్వారం రాములును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్‌ జిల్లా కైలాసపురంలో 1944లో జన్మించిన రాములు ప్రాథమిక విద్యాభ్యాసమంతా జనగామ తాలూకా దేవరుప్పలలో పూర్తి చేశారు. వరంగల్‌లో బ్యాచ్‌లర్‌ ఆఫ్ ఆర్ట్స్‌లో పట్టభద్రులైన ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోస్టుగ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1967 బ్యాచ్‌లో ఐపిఎస్‌కు ఎంపికయ్యారు. చిత్తూరు, నెల్లూరు, ఖమ్మం జిల్లాల్లో ఎస్సీగా ఆయన […]

తెలంగాణ పర్యాటక సంస్థ ఛైర్మన్‌గా పేర్వారం
X

తెలంగాణ తొలి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ పేర్వారం రాములును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్‌ జిల్లా కైలాసపురంలో 1944లో జన్మించిన రాములు ప్రాథమిక విద్యాభ్యాసమంతా జనగామ తాలూకా దేవరుప్పలలో పూర్తి చేశారు. వరంగల్‌లో బ్యాచ్‌లర్‌ ఆఫ్ ఆర్ట్స్‌లో పట్టభద్రులైన ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోస్టుగ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1967 బ్యాచ్‌లో ఐపిఎస్‌కు ఎంపికయ్యారు. చిత్తూరు, నెల్లూరు, ఖమ్మం జిల్లాల్లో ఎస్సీగా ఆయన పని చేశారు. హైదరాబాద్‌లోని పశ్చిమ, తూర్పు, ఉత్తర జోన్‌లలో డీసీపీగాను, ఏలూరు, హైదరాబాద్‌ జోన్లలో డిఐజీగాను, అవినీతి నిరోధక శాఖలో డైరెక్టర్‌ జనరల్‌గా ఇంకా అనేక పదవులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరించారు. తన మీద నమ్మకం ఉంచి పర్యాటక అభివృద్ధి సంస్థకు ఛైర్మన్‌గా కేసీఆర్‌ నియమించడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. గత పాలకులు నిర్లక్ష్యం చేసిన తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దుతానని, గోదావరి నదీ తీరాన ఉన్న కాళేశ్వరాన్ని విదేశీయులను ఆకర్షించేవిధంగా చేస్తానని అన్నారు. అధికారంలో ఉన్న ఎవరైనా వేములవాడకు వస్తే పదవులు పోతాయన్న అపప్రధ ఉందని, దీన్ని పోగొట్టాలని ఆయన అన్నారు. తెలంగాణలోని అన్ని పర్యాటక ప్రాంతాలను ప్రజలు ఆకర్షించే విధంగా తీర్చి దిద్దుతానని పేర్వారం రాములు చెప్పారు.

First Published:  23 March 2015 6:45 AM GMT
Next Story