Telugu Global
National

బొగ్గు కుంభకోణంలో దాసరి పాత్రకు సాక్ష్యాలు

బొగ్గు కుంభకోణంలో మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు పాత్రను సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ ధ్రువీకరించింది. ఆయన అవినీతికి పాల్పడినట్టు గుర్తించింది. 2008లో జిందాల్‌ కంపెనీకి గనుల కేటాయింపులో దాసరి కీలకపాత్ర పోషించారని పేర్కొంది. దీనివల్ల ఆయన 2.25 కోట్లు లబ్ది పొందారి పేర్కొంది. దాసరి అకౌంట్‌లో ఈ మొత్తం ఉన్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరరేట్‌ గుర్తించింది. జిందాల సంస్థకు అనుకూలంగా వ్యవహరించినందుకు క్విడ్‌ ప్రో కింద ఆ కంపెనీ దాసరి సంస్థలో 2.25 కోట్ల రూపాయలు […]

బొగ్గు కుంభకోణంలో దాసరి పాత్రకు సాక్ష్యాలు
X

బొగ్గు కుంభకోణంలో మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు పాత్రను సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ ధ్రువీకరించింది. ఆయన అవినీతికి పాల్పడినట్టు గుర్తించింది. 2008లో జిందాల్‌ కంపెనీకి గనుల కేటాయింపులో దాసరి కీలకపాత్ర పోషించారని పేర్కొంది. దీనివల్ల ఆయన 2.25 కోట్లు లబ్ది పొందారి పేర్కొంది. దాసరి అకౌంట్‌లో ఈ మొత్తం ఉన్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరరేట్‌ గుర్తించింది. జిందాల సంస్థకు అనుకూలంగా వ్యవహరించినందుకు క్విడ్‌ ప్రో కింద ఆ కంపెనీ దాసరి సంస్థలో 2.25 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినట్టు సీబీఐ గుర్తించింది. ఈ అంశంపై చాలా కాలం నుంచి దర్యాప్తు జరుగుతుంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే దాసరిని పలుమార్లు సీబీఐ విచారించింది. దాసరికి చెందిన సౌభాగ్య మీడియా కంపెనీకి చెందిన ఆస్తులను జప్తు చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమాయత్తమవుతోంది. ఇంతకుముందే ఈ కేసులో తన ప్రమేయాన్ని దాసరి తోసిపుచ్చారు. కాని పలు ఫైళ్ళ పరిశీలన అనంతరం దాసరికి ఈ కేసులో ప్రత్యక్ష జోక్యం ఉందని సీబీఐ, ఈ.డీ. గుర్తించాయి.

First Published:  23 March 2015 12:59 AM GMT
Next Story