Telugu Global
Cinema & Entertainment

హీరో నాగార్జునకు వేలం నోటిసులు

అక్కినేని నట వారసుడు , అన్నపూర్ణ స్టూడియో అథినేత, కోట్ల ఆస్తులకు వారసుడిగా ఉన్న హీరో నాగార్జున అక్కినేనికి బ్యాంకులు వేలం నోటిసులను జారీ చేశాయి. రియల్‌ ఏస్టేట్‌ వ్యవహారాలు, సినిమాలు, స్టూడియోలు, పలు నగరాల్లో ఆస్తులు, చిత్రనిర్మాణం, డిస్టిబ్యూషన్‌ లాంటి పలు వ్యాపారాలల్లో ఎడాదికి కోట్ల రూపాయలు టర్నవర్‌ కలిగిన నాగార్జునకు బ్యాంకు రుణాలను తిరిగి తీర్చలేని ఆర్ధిక పరిస్థితిలో ఉన్నాడా అనే ప్రశ్న తలెత్తుతుంది. నాగార్జున కుటుంబానికి చెందిన ఏడు ఎకరాల స్థలంలో ఉన్న […]

హీరో నాగార్జునకు వేలం నోటిసులు
X

అక్కినేని నట వారసుడు , అన్నపూర్ణ స్టూడియో అథినేత, కోట్ల ఆస్తులకు వారసుడిగా ఉన్న హీరో నాగార్జున అక్కినేనికి బ్యాంకులు వేలం నోటిసులను జారీ చేశాయి. రియల్‌ ఏస్టేట్‌ వ్యవహారాలు, సినిమాలు, స్టూడియోలు, పలు నగరాల్లో ఆస్తులు, చిత్రనిర్మాణం, డిస్టిబ్యూషన్‌ లాంటి పలు వ్యాపారాలల్లో ఎడాదికి కోట్ల రూపాయలు టర్నవర్‌ కలిగిన నాగార్జునకు బ్యాంకు రుణాలను తిరిగి తీర్చలేని ఆర్ధిక పరిస్థితిలో ఉన్నాడా అనే ప్రశ్న తలెత్తుతుంది. నాగార్జున కుటుంబానికి చెందిన ఏడు ఎకరాల స్థలంలో ఉన్న (అన్నపూర్ణ స్టూడియో దిగువన) స్టూడియోకు ఆంధ్రాబ్యాంకు, ఇండియన్‌ బ్యాంకులు నాగార్జునకు వేలం నోటీసులు జారీ చేశాయి. ఏడు ఎకరాల భూమిని తనఖా పెట్టి నాగార్జున బ్యాంకు నుండి అప్పు తీసుకున్నారు. ఆ అప్పును సక్రమంగా తీర్చక పోవటంతో జప్తుకు నోటిస్‌ జారీ చేశారు. ప్రస్తుతం చెల్లించాలసిన అప్పు 62 కోట్లకు చేరింది. ఈ అప్పును తిరిగి చెల్లించాలని బ్యాంకులు ఎన్ని నోటీసులు ఇచ్చినా నాగార్జున స్పందించకపోవటంతో భూమిని వేలం వేయడానికి ప్రకటనను జారీ చేశాయి. ఈ ఏడు ఎకరాల భూమిపై ఎలాంటి లావాదేవిలు జరపరాదని నోటిస్‌లో సృష్టం చేశాయి. నాగార్జునతో పాటు వెంకట్‌ అక్కినేని,వై సురేంద్ర, నాగసుశీల, సుప్రియలకు ఇండియన్‌, ఆంధ్రాబ్యాంకులు సంయుక్తంగా నోటిస్‌లు జారీ చేశాయి.

First Published:  24 March 2015 2:02 AM GMT
Next Story