Telugu Global
International

కుప్పకూలిన జర్మనీ విమానం

జర్మనీ ఎయిర్‌ లైన్స్‌కి చెందిన ఎయిర్‌ బస్‌ ఎ-320 సోమవారం కుప్పకూలిపోయింది. కుప్పకూలిన జర్మనీ విమానం మరో 148 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. డస్సెల్‌ డార్ఫ్‌ నుంచి బార్సిలోనా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో 142 మంది ప్రయాణికులతోపాటు ఆరుగురు సిబ్బంది కూడా ఉన్నారు. సాంకేతిక లోపమా లేక మానవ తప్పిదమా అన్న విషయం ఇంకా తెలియలేదు. ప్రాన్స్‌లోని డిగ్నే ప్రాంతంలో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఈ విమానం కూలిపోయింది. లుప్తాన్సాకు చెందిన ఈ […]

కుప్పకూలిన జర్మనీ విమానం
X

జర్మనీ ఎయిర్‌ లైన్స్‌కి చెందిన ఎయిర్‌ బస్‌ ఎ-320 సోమవారం కుప్పకూలిపోయింది. కుప్పకూలిన జర్మనీ విమానం మరో 148 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. డస్సెల్‌ డార్ఫ్‌ నుంచి బార్సిలోనా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో 142 మంది ప్రయాణికులతోపాటు ఆరుగురు సిబ్బంది కూడా ఉన్నారు. సాంకేతిక లోపమా లేక మానవ తప్పిదమా అన్న విషయం ఇంకా తెలియలేదు. ప్రాన్స్‌లోని డిగ్నే ప్రాంతంలో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఈ విమానం కూలిపోయింది. లుప్తాన్సాకు చెందిన ఈ విమానాన్ని జర్మన్‌ సంస్థ ఆపరేట్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విమానం 25 సంవత్సరాల క్రితంది అని, దీనికి సంబంధించిన శకలాలు ఓ గ్రామం సమీపంలో ఉన్నాయని ప్రాన్స్‌ మీడియా తెలిపింది. భారతీయ కాలమానం ప్రకారం రెండున్నర గంటల సమయంలో ఇది కుప్పకూలిపోయినట్టుగా తెలుస్తోంది. విమానం కూలిపోయినప్పుడు దాదాపు 35 మైళ్ళ ఎత్తులో ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడిని ఉటంకిస్తు మీడియా చెబుతోంది.

First Published:  24 March 2015 6:55 AM GMT
Next Story