Telugu Global
NEWS

తెలంగాణా హైకోర్టు ఏర్పాటుకి హైకోర్టు బ్రేక్

తెలంగాణలో హైకోర్టు ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యిందని అందరూ భావిస్తున్న తరుణంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కూడా ఈ విషయంలో చకచకా పావులు కదపడం చూస్తే ఒకటి రెండు నెలల్లో తెలంగాణ న్యాయవాదులు, రాజకీయ నాయకులు కోరుకున్నట్టు హైకోర్టు విభజనతో తెలంగాణకు ప్రత్యేక కోర్టు వస్తుందని భావించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో అడుగు ముందుకేసి అవసరమైతే హైకోర్టుకు గచ్చిబౌలిలో భవనాలు కూడా ఇస్తామని ప్రకటించారు. అయితే హైకోర్టు ధర్మాసనమే ప్రత్యేక కోర్టు […]

AP High Court
X

తెలంగాణలో హైకోర్టు ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యిందని అందరూ భావిస్తున్న తరుణంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కూడా ఈ విషయంలో చకచకా పావులు కదపడం చూస్తే ఒకటి రెండు నెలల్లో తెలంగాణ న్యాయవాదులు, రాజకీయ నాయకులు కోరుకున్నట్టు హైకోర్టు విభజనతో తెలంగాణకు ప్రత్యేక కోర్టు వస్తుందని భావించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో అడుగు ముందుకేసి అవసరమైతే హైకోర్టుకు గచ్చిబౌలిలో భవనాలు కూడా ఇస్తామని ప్రకటించారు. అయితే హైకోర్టు ధర్మాసనమే ప్రత్యేక కోర్టు అంశాన్ని వ్యతిరేకించడం విశేషం. కల్యాణ్‌ జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌ కుమార్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఈ అంశంపై వేసిన ఒక పిటిషన్‌పై స్పందిస్తూ రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికే హైకోర్టు ఏర్పాటు చేయవలసి ఉంటుంది తప్ప తెలంగాణా రాష్ట్రానికి కాదని స్పష్టంగా పేర్కొంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేసుకుంటే ప్రస్తుతం ఉన్న హైకోర్టు తెలంగాణా రాష్ట్రానికే చెందుతుంది గనుక ఇప్పుడు వేరేగా హైకోర్టు ఏర్పాటు చేయవలసిన అవసరం లేదని, ఆవిధంగా చేయడం విభజన బిల్లుకి వ్యతిరేకమని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. విభజన బిల్లులో ఆంద్రప్రదేశ్ రాష్ట్రం హైకోర్టు ఏర్పాటు చేసుకొనే వరకు ప్రస్తుత హైకోర్టే ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా కొనసాగుతుందని స్పష్టంగా ఉందని, అందుకు నిర్దిష్ట కాల పరిమితి కూడా పేర్కొనలేదు కాబట్టి తెలంగాణా రాష్ట్రానికి వేరేగా హైకోర్టు ఏర్పాటు చేయవలసిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ తెలంగాణకు వేరేగా హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పడాన్ని కూడా కోర్టు ధర్మాసనం తప్పు పట్టింది. ఒకవేళ ఆవిధంగా చేయడలచుకొంటే రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్ 31ని సవరించవలసి ఉంటుందని స్పష్టం చేసింది. హైకోర్టు విభజన విషయంపై ఇరు రాష్ట్రాలు కౌంటర్ ఫైల్ చేయాలని కోర్టు ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణాకి హైకోర్టు ఏర్పాటు కోసం న్యాయవాదులు ఆందోళనలు చేయరాదని, ఎవరయినా తమ ఆదేశాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

First Published:  24 March 2015 4:34 AM GMT
Next Story