Telugu Global
International

యోగాకు ఇస్లాం వ్యతిరేకం

యోగా ఇస్లాం వ్యతిరేకమని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) స్పష్టం చేసింది. రెండు రోజులపాటు నిర్వహించిన బోర్డు 24వ వార్షిక సమావేశంలో ఈ విధమైన ప్రకటన చేసింది. ‘‘సూర్య నమస్కారాలు, యోగా ఇస్లాం వ్యతిరేకం. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి’’ అని బోర్డు సహాయ ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ రహీం ఖురేషీ విలేకరులతో అన్నారు. రాజస్థాన్‌లోని పాఠశాలల్లో సూర్య నమస్కారాలు, యోగాను తప్పనిసరి చేయాలన్న నిర్ణయాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని ఆ […]

యోగాకు ఇస్లాం వ్యతిరేకం
X

యోగా ఇస్లాం వ్యతిరేకమని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) స్పష్టం చేసింది. రెండు రోజులపాటు నిర్వహించిన బోర్డు 24వ వార్షిక సమావేశంలో ఈ విధమైన ప్రకటన చేసింది. ‘‘సూర్య నమస్కారాలు, యోగా ఇస్లాం వ్యతిరేకం. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి’’ అని బోర్డు సహాయ ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ రహీం ఖురేషీ విలేకరులతో అన్నారు. రాజస్థాన్‌లోని పాఠశాలల్లో సూర్య నమస్కారాలు, యోగాను తప్పనిసరి చేయాలన్న నిర్ణయాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. బలవంతంగా అమలు చేయాలని చూస్తే అంగీకరించవద్దని ముస్లిం యువతకు పిలుపునిచ్చింది. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ చట్ట ఉల్లంఘనకు పాల్పడవద్దని, అలా జరిగితే ఆ సాకుతో ఆరెస్సెస్‌ వంటి హిందూ సంస్థలు ముస్లింలను జాతి వ్యతిరేకులుగా చిత్రించే కుట్ర చేస్తాయని హెచ్చరించింది. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక హిందుత్వ శక్తులు మైనారిటీలపై తమ అజెండాను రుద్దే ప్రయత్నాలు ముమ్మరం చేశాయని ఆరోపించింది. దీంతో ముస్లింలే కాకుండా క్రైస్తవులు కూడా అభద్రతకు గురవుతున్నారని పేర్కొంది.

First Published:  24 March 2015 5:07 AM GMT
Next Story