Telugu Global
NEWS

ప్రాథమిక వైద్యానికి తెలంగాణ ప్రాథాన్యం

తెలంగాణలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. కార్పొరేట్‌ ఆస్పత్రుల కన్నా ముఖ్యంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలపై దృష్టి సారిస్తే సామాన్యులకు వైద్యం అందుబాటులో ఉంటుందన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ముందుగా రాష్ట్రంలోని పది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ది పరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 63 కోట్లను ఖర్చు చేయనుంది. ఈమేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌చందా ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో 53.80 కోట్లను […]

ప్రాథమిక వైద్యానికి తెలంగాణ ప్రాథాన్యం
X

తెలంగాణలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. కార్పొరేట్‌ ఆస్పత్రుల కన్నా ముఖ్యంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలపై దృష్టి సారిస్తే సామాన్యులకు వైద్యం అందుబాటులో ఉంటుందన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ముందుగా రాష్ట్రంలోని పది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ది పరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 63 కోట్లను ఖర్చు చేయనుంది. ఈమేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌చందా ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో 53.80 కోట్లను ఆర్‌ఐ డిఎఫ్‌-20 కింద కేంద్రం ఇవ్వనుండగా మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం సమకూర్చనుంది. అభివృద్ధి చేసే ఆసుపత్రుల్లో వరంగల్‌లోని గూడూరు, జాఫర్‌ఘడ్‌, ఆదిలాబాద్‌లోని ఉట్నూరు, నర్సాపూర్‌, నల్లగొండలోని నాగార్జుసాగర్‌, నిజామాబాద్‌లోని ఎల్లారెడ్డి, మెదక్‌లోని సదాశివపేట, మిర్జాపూర్‌, మహబూబ్‌నగర్‌లోని వీపనగండ్ల, ఖమ్మంలోని తిర్మలాయపాలెం ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో ఆరు బెడ్లు ఉన్న ఆసుపత్రులను 30 పడకల ఆసుపత్రులుగా తీర్చిదిద్దనున్నారు.

First Published:  24 March 2015 3:53 AM GMT
Next Story