Telugu Global
NEWS

ఛార్జీల పెంపుతో బాబు అసలు రూపం బయటపడింది: జగన్‌

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి ఇపుడు విద్యుత్‌ ఛార్జీలను పెంచారని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. 2004-2009 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ఒక్క పైసా కూడా ఛార్జీలు పెంచలేదని ఆయన గుర్తు చేశారు. వై.ఎస్‌. తర్వాత అధికారం వెలగబెట్టిన ముఖ్యమంత్రులు కె. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఇష్టమొచ్చినట్టు విద్యుత్‌ ఛార్జీలు పెంచినా తెలుగు కాంగ్రెస్‌గా మారి ఆ ప్రభుత్వాలను కాపాడిన ఘనత ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబునాయుడు కాదా […]

ఛార్జీల పెంపుతో బాబు అసలు రూపం బయటపడింది: జగన్‌
X

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి ఇపుడు విద్యుత్‌ ఛార్జీలను పెంచారని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. 2004-2009 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ఒక్క పైసా కూడా ఛార్జీలు పెంచలేదని ఆయన గుర్తు చేశారు. వై.ఎస్‌. తర్వాత అధికారం వెలగబెట్టిన ముఖ్యమంత్రులు కె. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఇష్టమొచ్చినట్టు విద్యుత్‌ ఛార్జీలు పెంచినా తెలుగు కాంగ్రెస్‌గా మారి ఆ ప్రభుత్వాలను కాపాడిన ఘనత ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబునాయుడు కాదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో తగిన సంఖ్యాబలం లేకపోయినా ఛార్జీలు పెంచినప్పుడు తాము కిరణ్‌కుమార్‌రెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే విప్‌ జారీ చేసి మరీ ఆదుకున్న ఘనుడు చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. మళ్ళీ అసెంబ్లీ బయటికి వచ్చి మాత్రం ఛార్జీల పెంపును వ్యతిరేకించమంటూ ప్రజలకు పిలువు ఇచ్చి కాగితం పులి వేషం వేశారని, ఇవన్నీ జనం మరిచిపోయారనుకుంటున్నారా అని నిలదీశారు. వై.ఎస్‌. హయాంలో పరిశ్రమలకు ఉన్న టారిఫ్‌ను సైతం తగ్గించారని జగన్‌ గుర్తు చేశారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 8 సార్లు కరెంట్‌ ఛార్జీలు పెంచారని, ఇపుడు మళ్ళీ ఆ బాటలో పయనిస్తున్నారని ఆయన ఆరోపించారు.

First Published:  24 March 2015 1:57 AM GMT
Next Story