ఫిలింనగర్‌లో మళ్ళీ డ్రగ్స్ విజృంభణ

హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో మళ్లి డ్రగ్స్ విజృంభిస్తున్నాయి. ఫిల్మింనగర్‌లో పోలీసు నిఘా లోపించడంతో విద్రోహులకు ఇది కలిసి వస్తుంది. తక్కువ పెట్టుబడి ఎక్కువ అదాయం కలిగిన ఈ డ్రగ్స్‌ వ్యాపారాన్ని నటులు ఉపయోగించుకుంటున్నారు. ఈ డ్రగ్స్‌ వాడుతూ సిని ప్రముఖులు కొందరు మత్తుకు బానిసలు అవుతున్నారు. గతంలో హీరో రవితేజ సోదరులు, హీరో తరుణ్, నటి జీవిత సోదరుడు, కొందరు నిర్మాతలు డ్రగ్స్‌తోపాటు పట్టుపడిన సందర్భాలున్నాయి. ఆ తర్వాత పోలీస్లు నిఘా పెంచి, సోదాలు ముమ్మరం చేయడంతో కొంతకాలం ఈ కార్యక్రమాలు ఆగిపోయాయి. తర్వాత పోలీసు నిఘా తగ్గిపోవడంతో కొందరు చాప క్రింద నీరులా డ్రగ్స్ వ్యాపారం మళ్లి కోనసాగిస్తున్నారు. చెక్కపోస్ట్ పరిసరాల్లో ఉన్న ఒక పబ్బులో ఈ డ్రగ్స్‌ ఎక్కువగా వినియోగమవుతున్నట్టు సమాచారం. రాత్రివేళ ఫిలింనగర్‌ పరిసరాల్లో డ్రగ్స్ సేవిస్తూ యువకులు కనిపిస్తున్నా పోలీసులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నట్టు సమాచారం. ఆర్ధికంగా దెబ్బతిన్న నిర్మాతలు, ఒకటి రెండు సినిమాల తర్వాత ఆఫర్లు లేని చిన్నచిన్న హీరోలు ఈ డ్రగ్స్‌కు బానిసలవుతున్నట్టు ఫిలింనగర్‌ వర్గాలు చెబుతున్నాయి.