Telugu Global
Cinema & Entertainment

చందమామ కథలు సినిమాకు జాతీయ అవార్డు

62వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఈ యేడాది జాతీయ ఉత్తమ చిత్రంగా మరాఠీ సినిమా కోర్ట్‌ ఎంపికైంది. ఉత్తమ హిందీ చిత్రంగా క్వీన్‌, జాతీయ ఉత్తమ నటుడుగా విజయ్‌ (కన్నడ), ఉత్తమ నటిగా కంగనా రనౌత్‌ (క్వీన్‌), ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా మేరీకోం ఎంపికయ్యాయి. ప్రాంతీయ చిత్రాల కేటగిరిలో ఈ యేడాది ఉత్తమ తెలుగు చలన చిత్రంగా చందమామ కథలు ఎంపికైంది. ప్రవీణ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మే 3న ఢిల్లీలోని […]

చందమామ కథలు సినిమాకు జాతీయ అవార్డు
X

62వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఈ యేడాది జాతీయ ఉత్తమ చిత్రంగా మరాఠీ సినిమా కోర్ట్‌ ఎంపికైంది. ఉత్తమ హిందీ చిత్రంగా క్వీన్‌, జాతీయ ఉత్తమ నటుడుగా విజయ్‌ (కన్నడ), ఉత్తమ నటిగా కంగనా రనౌత్‌ (క్వీన్‌), ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా మేరీకోం ఎంపికయ్యాయి. ప్రాంతీయ చిత్రాల కేటగిరిలో ఈ యేడాది ఉత్తమ తెలుగు చలన చిత్రంగా చందమామ కథలు ఎంపికైంది. ప్రవీణ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మే 3న ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగేకార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా జాతీయ చలన చిత్రపురస్కారాల ప్రదానం జరుగుతుంది. ఉత్తమ హిందీ చిత్రంగా క్వీన్‌, ఉత్తమ అస్సామీ చిత్రంగా ఒథేల్లో, ఉత్తమ బెంగాలీ చిత్రంగా నిర్భాషితో, కన్నడ చిత్రంగా హరివు, కొంకిణి చిత్రం నచోం-కుమ్పసర్‌, మళయాళ చిత్రం ఐన్‌, మరాఠీ చిత్రం కిల్లా, ఒడిషా చిత్రం అడిం విచార్‌, పంజాబీ చిత్రం – పంజాబ్‌ 1984, తమిళ చిత్రం కుత్తరం కదితాల్‌, హర్యానా చిత్రం పగ్డి ది ఆనర్‌ అవార్డులకు ఎంపికయ్యాయి. తాను నటించిన చిత్రానికి అవార్డు రావడం పట్ల చందమామ కథలు చిత్రంలో నటించిన మంచులక్ష్మి అనందం వ్యక్తం చేశారు. తెలుగు ఫిలిం ఇండస్త్రి గర్వపడాల్సిన విషయమని ఆమె అన్నారు. ఈ చిత్రానికి అవార్డు రావడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనమని నటుడు, రచయిత వై.ఎస్‌. కృష్ణేశ్వరరావు అన్నారు. ఈ చిత్రంలో ఈయన బిచ్చగాడి పాత్రలో నటించారు. ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శకుడు ప్రవీణ్‌ సత్తార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

First Published:  24 March 2015 11:34 PM GMT
Next Story