పవన్‌ కల్యాణ్‌తో దాసరి సినిమా!

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా తీయాలని దాసరి ప్రయత్నిస్తున్నారు. ఇలా నిర్మాతగా మారి సినిమా రంగంలో మళ్ళీ తన పూర్వ వైభవాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు దాసరి. చిత్ర పరిశ్రమలో అందరు గురువుగా పిలుచుకునే దర్శకరత్న దాసరి నారాయణరావు బొగ్గు గనుల కుంభకోణంలో ఇరుక్కుని గిలగిలాడుతున్నాడు. దాసరిని నిందితుడిగా నిర్థారణ చేస్తూ పక్కా అధారాల కోసం సి.బి.ఐ. ప్రయత్నం చేస్తుంది. కేంద్ర మాజీ మంత్రిగా దాసరి ఆక్రమంగా సంపాదించిన ఆస్తుల వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ఆరా తీస్తోంది. జిందాల్‌ స్టీలుకు బొగ్గు గనుల కేటాయింపులో దాసరి అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి కాంట్రాక్టు ఇప్పించారని, దీనికి ప్రతిఫలంగా జిందాల్ కంపెనీ యాజమాన్యం దాసరి సంస్థ అయిన సౌభాగ్య మీడియాలో 2.25 కోట్లను పెట్టుబడిగా పెట్టిందని సిబిఐ ఆరోపిస్తూ దాసరిని నిందితుడిగా పేర్కొంది. దీనికి సబంధించి కొంతకాలం క్రితమే ఈడీ దాసరిపై హవాలా కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో దాసరి వెంట తిరిగే శిష్యగణం ఆయనకు దూరంగా ఉంటూ ముఖం చాటేస్తున్నారు. పైగా దాసరికి ఆర్యోగం సహకరించటం లేదు. ఇలాంటి సమయంలో పవన్‌తో సినిమా ఏమవుతుందో తెలియక… సిబీఐ కేసు ఎలాంటి పరిస్థితి కల్పిస్తుందో అర్ధం కాక దాసరి సతమతమవుతున్నారు.