Telugu Global
National

ఇస్రో ఛైర్మన్‌కు గౌరవ డాక్టరేట్‌

చెన్నై: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం(ఇస్రో) చైర్మన్‌ డాక్టర్‌ ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ను గౌరవ డాక్టరేట్‌ వరించింది. చెన్నైలోని ఎస్‌.ఆర్‌.ఎం వర్సిటీ చాన్సలర్‌ టీఆర్‌ పచ్చముత్తు, అధ్యక్షుడు పి.సత్యనారాయణ సమక్షంలో దీనిని ఆయనకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చిత్తశుద్ధి, అంకితభావం భవిష్యత్‌కు సోపానాలు కాగలవని, వీటిని ప్రతి విద్యార్థీ అలవర్చుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ కార్యదర్శి అశుతోష్‌ శర్మ, […]

ఇస్రో ఛైర్మన్‌కు గౌరవ డాక్టరేట్‌
X

చెన్నై: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం(ఇస్రో) చైర్మన్‌ డాక్టర్‌ ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ను గౌరవ డాక్టరేట్‌ వరించింది. చెన్నైలోని ఎస్‌.ఆర్‌.ఎం వర్సిటీ చాన్సలర్‌ టీఆర్‌ పచ్చముత్తు, అధ్యక్షుడు పి.సత్యనారాయణ సమక్షంలో దీనిని ఆయనకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చిత్తశుద్ధి, అంకితభావం భవిష్యత్‌కు సోపానాలు కాగలవని, వీటిని ప్రతి విద్యార్థీ అలవర్చుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ కార్యదర్శి అశుతోష్‌ శర్మ, కాలిఫోర్నియా వర్సిటీ చాన్సలర్‌ ప్రదీ్‌పకోస్లాలు గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. ఈ సందర్భంగా మొత్తం 14 వేల మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. వీరిలో ఏడుగురు అంధులు కూడా ఉన్నారు. ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ ప్రదానం చేసిన గౌరవ డాక్టరేట్‌ తన బాధ్యతను మరింత పెంచిందని ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌ చెప్పారు. విద్యార్ధులు సమాజ సేవలో కొంత సమయం గడపాలని ఆయన పిలుపునిచ్చారు.

First Published:  25 March 2015 10:02 PM GMT
Next Story