Telugu Global
NEWS

అసిస్టెంట్ డ్ర‌గ్ కంట్రోల‌ర్ ఆస్తి...రూ..150 కోట్లు!

ఆయనో ప్రభుత్వ ఉద్యోగి… ఆక్ర‌మాస్తుల చిట్టా చూస్తే గుబులు పుట్ట‌డం ఖాయం. ఆ అధికారి ఆస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులకే దిమ్మ తిరిగిందంటే ఈ తిమింగలం ఏ రీతిన అవినీతికి పాల్ప‌డిందో ఇట్టే ప‌సిగ‌ట్ట‌వ‌చ్చు. ఏసీబీ అధికారులు చేసిన దాడిలో అయ్యగారి ఆస్తులు సుమారు రూ.150 కోట్లు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీనికి సంబంధించి… వివ‌రాలను ప‌రిశీలిస్తే…ఆదిలాబాద్‌ అసిస్టెంట్‌ డ్రగ్‌ కంట్రోలర్‌ మయూరి విజయ్ గోపాల్ ఇంటిపై ఏసీబీ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఆదిలాబాద్తోపాటు హైదరాబాద్లోని […]

ఆయనో ప్రభుత్వ ఉద్యోగి… ఆక్ర‌మాస్తుల చిట్టా చూస్తే గుబులు పుట్ట‌డం ఖాయం. ఆ అధికారి ఆస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులకే దిమ్మ తిరిగిందంటే ఈ తిమింగలం ఏ రీతిన అవినీతికి పాల్ప‌డిందో ఇట్టే ప‌సిగ‌ట్ట‌వ‌చ్చు. ఏసీబీ అధికారులు చేసిన దాడిలో అయ్యగారి ఆస్తులు సుమారు రూ.150 కోట్లు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీనికి సంబంధించి… వివ‌రాలను ప‌రిశీలిస్తే…ఆదిలాబాద్‌ అసిస్టెంట్‌ డ్రగ్‌ కంట్రోలర్‌ మయూరి విజయ్ గోపాల్ ఇంటిపై ఏసీబీ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఆదిలాబాద్తోపాటు హైదరాబాద్లోని ఆయన ఇళ్లపై అధికారులు ఏకకాలంలో దాడి చేశారు. ఈ సందర్భంగా అధికారుల తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమాస్తులు బయటపడ్డాయి.
గోపాల్ నివాసంలో షాద్ నగర్, అంబర్పేట డీడీ కాలనీ, చిక్కడపల్లి, హయత్ నగర్, నల్లకుంటల్లో షాపింగ్ కాంప్లెక్స్లతోపాటు ఇళ్ల స్థలాలు, భారీ ఎత్తున బంగారం, విలువైన ఆస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈదాడుల‌ను ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు సీఎస్ వేణుగోపాల్, కాశయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. మరోవైపు గోపాల్ అవినీతి చిట్టాను లెక్క కట్టేందుకు అధికారులకు కనీసం వారం రోజులు సమయం పడుతుందట. గతంలోనూ గోపాల్ అక్రమాస్తుల కేసులో ఓసారి ఏసీబీకి చిక్కారు. ఆ తర్వాత కూడా ఆయన తన అక్రమ సంపాదనను ఆపలేదు. అడ్డదిడ్డంగా సంపాదించిన సొమ్మును గోపాల్…బినామీల పేర ఉంచిన‌ట్టు అధికారులు క‌నుగొన్నారు… -పి.ఆర్‌.
First Published:  27 March 2015 3:39 AM GMT
Next Story