Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 14

పెళ్లి కబుర్లు భార్య : ఏమండీ! మన పెళ్లి ఐదురోజులు ఘనంగా జరిపించిన పేరయ్యశాస్త్రి నిన్న రాత్రి చనిపోయాట్ట! భర్త : అనుకుంటాం గాని డార్లింగ్‌! చేసిన పాపం ఊరికేపోతుందా..?! ************ సలహా తల్లి : హలో ! డాక్టర్‌గారా ! మా అబ్బాయి ఒక ఇంక్‌ బాటిల్‌ తాగేశాడు డాక్టర్‌ : అలాగా! నేను ఒక గంటలో వస్తాను. తల్లి : గంటసేపా! అంతవరకూ ఏం చెయ్యమంటారు? డాక్టర్‌ : పెన్సిల్‌తో రాసుకోమనండి ************ సాధన […]

పెళ్లి కబుర్లు
భార్య : ఏమండీ! మన పెళ్లి ఐదురోజులు ఘనంగా జరిపించిన పేరయ్యశాస్త్రి నిన్న రాత్రి చనిపోయాట్ట!
భర్త : అనుకుంటాం గాని డార్లింగ్‌! చేసిన పాపం ఊరికేపోతుందా..?!
************
సలహా
తల్లి : హలో ! డాక్టర్‌గారా ! మా అబ్బాయి ఒక ఇంక్‌ బాటిల్‌ తాగేశాడు
డాక్టర్‌ : అలాగా! నేను ఒక గంటలో వస్తాను.
తల్లి : గంటసేపా! అంతవరకూ ఏం చెయ్యమంటారు?
డాక్టర్‌ : పెన్సిల్‌తో రాసుకోమనండి
************
సాధన
గోవిందు : మా నాన్న నిద్రలో నడుస్తాడు
సురేష్‌ : అదెలా వీలవుతుంది
గోవిందు : మా నాన్న ఆఫీసులో నిద్రపోతాడు. వాళ్ళ బాసు పిలిస్తే నిద్రలోనే లేచి నడిచి ఆఫీసర్‌ దగ్గరికి వెళతాడు. యింట్లో కూడా ప్రాక్టీసు చేస్తాడు
************
టాప్‌ర్యాంక్‌
వెంకట్‌ : మీ వాడు ఇంటి రూఫ్‌ మీద కూచుని ఎందుకు చదువుకుంటున్నాడు?
వేణు : మా వాడికి ‘టాప్‌’రాంక్‌ తెచ్చుకోవాలని పట్టుదల

First Published:  27 March 2015 8:00 AM GMT
Next Story