Telugu Global
NEWS

అసెంబ్లీ తీరుపై నివేదిక‌కు టీడీపీ క‌మిటీ

తెలుగుదేశం పార్టీ శుక్ర‌వారం అసెంబ్లీ స‌మావేశాలు ముగిసిన వెంట‌నే ఈ కార్య‌క్ర‌మాలు జ‌రిగిన తీరు, ఇందులో ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరు, స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న త‌దిత‌ర అంశాల‌పై విశ్లేష‌ణ జ‌రిపి నివేదిక ఇవ్వాల‌ని పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఆదేశించారు. ఇందుకోసం ఐదుగురు స‌భ్యుల‌తో క‌మిటీ కూడా వేశారు. ఈ క‌మిటీలో కాల‌వ శ్రీ‌నివాసులు, ప‌య్యావుల కేశ‌వ్‌, దూళిపాళ్ళ న‌రేంద్ర‌, అచ్చెనాయుడు, రావుల చంద్ర‌శేఖ‌ర‌రెడ్డిల‌ను నియ‌మించారు. అసెంబ్లీ జ‌రిగిన తీరు, ఇందులో ప్ర‌భుత్వ‌, ప్ర‌తిప‌క్ష స‌భ్యుల వ్య‌వ‌హార‌శైలి, ఎవ‌రు […]

తెలుగుదేశం పార్టీ శుక్ర‌వారం అసెంబ్లీ స‌మావేశాలు ముగిసిన వెంట‌నే ఈ కార్య‌క్ర‌మాలు జ‌రిగిన తీరు, ఇందులో ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరు, స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న త‌దిత‌ర అంశాల‌పై విశ్లేష‌ణ జ‌రిపి నివేదిక ఇవ్వాల‌ని పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఆదేశించారు. ఇందుకోసం ఐదుగురు స‌భ్యుల‌తో క‌మిటీ కూడా వేశారు. ఈ క‌మిటీలో కాల‌వ శ్రీ‌నివాసులు, ప‌య్యావుల కేశ‌వ్‌, దూళిపాళ్ళ న‌రేంద్ర‌, అచ్చెనాయుడు, రావుల చంద్ర‌శేఖ‌ర‌రెడ్డిల‌ను నియ‌మించారు. అసెంబ్లీ జ‌రిగిన తీరు, ఇందులో ప్ర‌భుత్వ‌, ప్ర‌తిప‌క్ష స‌భ్యుల వ్య‌వ‌హార‌శైలి, ఎవ‌రు ఎంత‌మేర స‌ఫ‌లీకృత‌మ‌య్యారు వంటి అంశాల‌ను నిశితంగా అధ్య‌య‌నం చేసి నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఆయ‌న కోరారు. భ‌విష్య‌త్‌లో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌న్న అంశంపై కూడా నిర్మాణాత్మ‌క సూచ‌న‌లు చేయాల‌ని చంద్ర‌బాబు సూచించారు.-పి.ఆర్‌.
First Published:  27 March 2015 7:30 AM GMT
Next Story