Telugu Global
NEWS

రెండు నెల‌ల్లో డ్వాక్రా రుణాల మాఫీ: బాబు

త్వరలో పశ్చిమ గోదావరి జిల్లాలో నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌)ని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. జిల్లాలో మెరైన్‌ వర్సీటీ కూడా నెలకొల్పుతామన్నారు. ఆదివారం పట్టిసీమ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మరో రెండు నెలల్లో డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. పట్టిసీమ ప్రాజెక్టు కింద ఈ సీజన్‌లో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంద‌ని తెలిపారు. కేంద్రం సహకారంతో […]

త్వరలో పశ్చిమ గోదావరి జిల్లాలో నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌)ని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. జిల్లాలో మెరైన్‌ వర్సీటీ కూడా నెలకొల్పుతామన్నారు. ఆదివారం పట్టిసీమ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మరో రెండు నెలల్లో డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. పట్టిసీమ ప్రాజెక్టు కింద ఈ సీజన్‌లో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంద‌ని తెలిపారు. కేంద్రం సహకారంతో నాలుగేళ్ళలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించామని చెప్పారు. ‘‘గోదావరి జిల్లాలకు అన్యాయం జరగనివ్వం. సముద్రంలోకి పోయే నీటిని మాత్రమే మళ్ళిస్తాం. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతి ఎకరానికీ నీళ్ళిచ్చే బాధ్యత త‌న‌ద‌ని. గోదావరి, కృష్ణ, పెన్నా నదులను అనుసంధానం చేసుకుంటే కరవు పరిస్థితులు ఉండవ‌ని. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చడానికి ‘నీరు-చెట్టు’ కార్యక్రమం చేపట్టాం’’అని చంద్ర‌బాబు తెలిపారు.-పిఆర్‌.
First Published:  29 March 2015 5:56 AM GMT
Next Story