Telugu Global
NEWS

వైభవంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

‘ఎన్టీఆర్ యుగపురుషుడు. రాజకీయాలకు గౌరవం తెచ్చిన నాయకుడు. తెలుగుజాతి అంతా క‌లిసి ఉండాల‌ని క‌ల‌లు క‌న్న వ్య‌క్తి ఆయ‌న‌. దుర‌దృష్ట‌క‌ర ప‌రిస్థితుల్లో తెలుగువారు రెండు రాష్ట్రాల్లో విడిపోయారు. భౌగోళికంగా విడిపోయినా తెలుగువారంతా ఒక్కటే. తెలుగుజాతి కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం పాటుపడుతుంది’ అని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ నిండు య‌వ్వ‌నంలో ఉంద‌ని, ఇది రాష్ట్రానికి ఎంతో చేయాల‌ని భావిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ 33వ […]

వైభవంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
X
‘ఎన్టీఆర్ యుగపురుషుడు. రాజకీయాలకు గౌరవం తెచ్చిన నాయకుడు. తెలుగుజాతి అంతా క‌లిసి ఉండాల‌ని క‌ల‌లు క‌న్న వ్య‌క్తి ఆయ‌న‌. దుర‌దృష్ట‌క‌ర ప‌రిస్థితుల్లో తెలుగువారు రెండు రాష్ట్రాల్లో విడిపోయారు. భౌగోళికంగా విడిపోయినా తెలుగువారంతా ఒక్కటే. తెలుగుజాతి కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం పాటుపడుతుంది’ అని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ నిండు య‌వ్వ‌నంలో ఉంద‌ని, ఇది రాష్ట్రానికి ఎంతో చేయాల‌ని భావిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ 33వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించ‌న సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొని చంద్ర‌బాబు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్, ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్ గౌడ్, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంత‌రం ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్ళి నివాళుల‌ర్పించారు.-పిఆర్‌
First Published:  29 March 2015 8:50 PM GMT
Next Story