Telugu Global
National

సాగరమాలకు సాద‌ర స్వాగ‌తం!

నరేంద్ర మోదీ ప్రభుత్వం చేప‌ట్టిన‌ ‘సాగరమాల’ ప్రాజెక్టు అనుకున్న ప్రకారం అమలు జరిగితే దేశాభివృద్ధికి దోహ‌ద ప‌డుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ అత్యంత భారీ ప్రాజెక్టును కేంద్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా ఆమోదించి, పథక రచనకు పచ్చజెండా ఊపడం కేంద్రమంత్రి గడ్కరీ చెప్పినట్టు విప్లవాత్మకమూ, చారిత్రాత్మకమే. ఈ ఒక్క ప్రాజెక్టు వల్లే స్థూల దేశీయోత్పత్తి రెండు శాతం పెరుగుతుందని భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తుంది. సాగ‌ర‌మాల పేరుతో ఈ ఓడరేవుల అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రత్యేక ఆర్థిక […]

నరేంద్ర మోదీ ప్రభుత్వం చేప‌ట్టిన‌ ‘సాగరమాల’ ప్రాజెక్టు అనుకున్న ప్రకారం అమలు జరిగితే దేశాభివృద్ధికి దోహ‌ద ప‌డుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ అత్యంత భారీ ప్రాజెక్టును కేంద్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా ఆమోదించి, పథక రచనకు పచ్చజెండా ఊపడం కేంద్రమంత్రి గడ్కరీ చెప్పినట్టు విప్లవాత్మకమూ, చారిత్రాత్మకమే. ఈ ఒక్క ప్రాజెక్టు వల్లే స్థూల దేశీయోత్పత్తి రెండు శాతం పెరుగుతుందని భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తుంది. సాగ‌ర‌మాల పేరుతో ఈ ఓడరేవుల అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రత్యేక ఆర్థిక మండళ్ళనూ, స్మార్ట్‌సిటీలనూ, పర్యాటక దీవులనూ జ‌త చేసి బీజేపీ ప్ర‌భుత్వం ఉజ్వలమైన భవిష్యత్తును క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపిస్తుంది. ఇది ఇప్ప‌టి ఆలోచ‌న కాదు. మాజీ ప్ర‌ధాని అటల్‌ బిహారీ వాజపేయి ప్రధానిగా ఉన్న దశాబ్దం నాటి ప‌థ‌కం. ఇపుడు అద‌నంగా స్మార్ట్‌సిటీలూ, సీఈజడ్‌లు ఈ సాగరమాలలో చేరాయి.
జాతీయ రహదారులు, నదులు, ఓడరేవుల అనుసంధానం అనుసంధానాన్ని అభివృద్ధికి ఊతంగా, సమగ్రత మూలాధారంగా ఒక విధానంగా ముందుకు తెస్తున్నది భారతీయ జనతాపార్టీ. స్వర్ణచతుర్భుజి సాధ్యపడినా, నదుల అనుసంధానానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. సాగరమాల ప్రాజెక్టు ఓడరేవుల అనుసంధానికీ, అభివృద్ధికి సంబంధించి దేశచరిత్రలో ఎన్నడూ లేనంత సమన్వయం సాధించబోతున్న మాట వాస్తవం. పెద్ద ఓడ‌రేవులు కేంద్రం చేతిలోను, చిన్న‌చిన్న రేవులు రాష్ట్రాల చేతుల్లోను ఉన్నాయి. చిన్న‌వాటి నిర్వ‌హ‌ణ కూడా కేంద్రం తీసుకోవాల‌ని గ‌తంలో భావించినా రాష్ట్రాలు విముఖ‌త‌తో అది సాధ్యం కాలేదు. ఇప్ప‌టికైనాస‌మ‌న్వ‌యంతో ముందుకు వెళ్ళే ప‌రిస్థితి సాకార‌మ‌యితే సాగ‌ర‌మాలకు సాద‌ర స్వాగ‌తం ల‌భించిన‌ట్టే!-పిఆర్‌
First Published:  30 March 2015 4:17 AM GMT
Next Story