Telugu Global
International

ప్ర‌ధాని మోడీతో జ‌గ‌న్ స‌మావేశం

రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి కేంద్రం ఇచ్చిన హామీలు నెర‌వేర్చాల్సిందిగా వైకాపా అధ్య‌క్షుడు వై.ఎస్‌.జ‌గ‌న్మోన్‌రెడ్డి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడిని కోరారు. సోమ‌వారం ఢిల్లీలో జ‌గ‌న్ త‌న పార్ల‌మెంటు స‌భ్యుల‌తో క‌లిసి ప్ర‌ధానితో అర‌గంట‌పాటు స‌మావేశ‌మ‌య్యారు. తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధికి బాట‌లు వేయాలంటే కేంద్రం స‌హ‌క‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌ధానికి చెప్పిన‌ట్టు జ‌గ‌న్ తెలిపారు. పోల‌వ‌రం, ప‌ట్టిసీమ ప్రాజెక్టుల విష‌య‌మై ఆయ‌న‌తో మాట్లాడామ‌ని, ప‌ట్టిసీమ చేప‌ట్ట‌డం వెనుక ఉన్న కార‌ణాల‌ను ఆయ‌న‌కు వివ‌రించామ‌ని తెలిపారు. గ‌తంలో తాము ప్ర‌ధాన‌మంత్రిని […]

ప్ర‌ధాని మోడీతో జ‌గ‌న్ స‌మావేశం
X

రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి కేంద్రం ఇచ్చిన హామీలు నెర‌వేర్చాల్సిందిగా వైకాపా అధ్య‌క్షుడు వై.ఎస్‌.జ‌గ‌న్మోన్‌రెడ్డి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడిని కోరారు. సోమ‌వారం ఢిల్లీలో జ‌గ‌న్ త‌న పార్ల‌మెంటు స‌భ్యుల‌తో క‌లిసి ప్ర‌ధానితో అర‌గంట‌పాటు స‌మావేశ‌మ‌య్యారు. తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధికి బాట‌లు వేయాలంటే కేంద్రం స‌హ‌క‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌ధానికి చెప్పిన‌ట్టు జ‌గ‌న్ తెలిపారు. పోల‌వ‌రం, ప‌ట్టిసీమ ప్రాజెక్టుల విష‌య‌మై ఆయ‌న‌తో మాట్లాడామ‌ని, ప‌ట్టిసీమ చేప‌ట్ట‌డం వెనుక ఉన్న కార‌ణాల‌ను ఆయ‌న‌కు వివ‌రించామ‌ని తెలిపారు. గ‌తంలో తాము ప్ర‌ధాన‌మంత్రిని క‌లిసి ఏపీకి ప్ర‌త్యేక హోదా, నిధుల విడుద‌ల‌, విభ‌జ‌న సంద‌ర్భంగా ఇచ్చిన హామీలను నెర‌వేర్చ‌డం… త‌దిత‌ర అంశాల గురించి మాట్లాడామ‌ని, అవే విష‌యాల‌ను మ‌ళ్ళీ గుర్తు చేశామ‌ని ఆయ‌న అన్నారు. గాలేరు, న‌గ‌రి, హాద్రీనీవా వంటి సీమ ప్రాజెక్టుల కోసం ఏపీ ప్ర‌భుత్వం కేటాయించిన నిధులు ఏమాత్రం స‌రిపోవ‌ని, అవి కేవ‌లం ఆయా ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ‌కు మాత్రమే స‌రిపోతాయ‌ని ఆయ‌న అన్నారు. ఈ విష‌యాల‌తోపాటు విశాఖ రైల్వే జోన్‌గా ప్ర‌క‌టించాల‌ని కోరామ‌ని, అలాగే వెనుక‌బ‌డిన జిల్లాల్లో అభివృద్ధికి నిధులు విడుద‌ల చేయాల‌ని కోరామ‌ని ఆయ‌న తెలిపారు. పోల‌వ‌రం ప్రాజెక్టు త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేస్తే రాయ‌ల‌సీమ రైతుల‌తోపాటు పొరుగు రాష్ట్రాల‌కు కూడా ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని ఆయ‌న చెప్పిన‌ట్టు తెలిపారు.-పిఆర్‌

First Published:  30 March 2015 7:05 AM GMT
Next Story