సింగపూర్‌లో సీఎం బృందం బిజీబిజీ

నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం, మాస్టర్‌ప్లాన్‌, పారిశ్రామికాభివృద్ధికి పెట్టుబడుల ఆహ్వానం కోసం సింగపూర్ వెళ్ళిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చాలా బిజీబిజీగా గ‌డుపుతున్నారు. దేశంలో చంద్రబాబునాయుడి పర్యటన రెండో రోజుకు చేరుకుంది. మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబు ఎమిరిటన్‌ సీనియర్‌ మినిస్టర్‌ గోచాక్‌ టాంగ్‌తో భేటి కానున్నారు. ఈ ఉద‌య‌మే ఆయ‌న త‌న బృందంతో క‌లిసి బిషన్‌పార్క్‌ను సంద‌ర్శించారు. అక్క‌డ ఒక చిన్న డ్ర‌యిన్‌ను కాల్వలా ఎలా మార్చారో అక్కడి అధికారులు బాబుకు వివరించారు. ఏపీలో చాలా కాలువ‌లు ఉన్నాయ‌ని వాటితోపాటు నదులను సింగపూర్‌ తరహాలో అభివృద్ధి చేయడానికి సహకారం ఇవ్వాలని అక్క‌డి అధికారుల‌ను సీఎం కోరారు. దీని స‌మ‌న్వ‌య బాధ్య‌త‌ను మున్సిపల్‌ మంత్రి నారాయణ, కార్యదర్శి గిరిధర్‌లకు అప్పగించారు. సింగపూర్‌లో పార్కుల అభివృద్ధికి మూడువేల మంది వాలంటీర్లు పాలుపంచుకున్నట్లు అక్కడి అధికారులు చెప్పారు. సాయంత్రం షాంగై నుంచి చంద్రబాబు స్వదేశానికి బయలుదేరనున్నారు.-పిఆర్‌