Telugu Global
National

త్వ‌ర‌లో కేంద్ర కేబినెట్ విస్త‌ర‌ణ‌!?

కేంద్ర కేబినెట్‌ను రెండోసారి విస్తరించాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. తాజా విస్తరణలో పలువురు కొత్తవారికి అవకాశమిచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. ఏప్రిల్‌ 3 నుంచి బెంగళూరులో రెండు రోజులపాటు జరిగే పార్టీ జాతీయ కార్యవర్గ భేటీ అనంతరం మంత్రివర్గ విస్తరణపై మోడీ దృష్టి సారించే అవకాశముందని తెలుస్తోంది. ఈసారి మిత్రపక్షాలైన పీడీపీ, శివసేనకు కేబినెట్‌ బెర్తులు లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. పీడీపీ నుంచి మహబూబా ముఫ్తీకి, గత విస్తరణ సమయంలో కేబినెట్‌ నుంచి బయటకు వచ్చిన శివసేన సభ్యుడు […]

కేంద్ర కేబినెట్‌ను రెండోసారి విస్తరించాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. తాజా విస్తరణలో పలువురు కొత్తవారికి అవకాశమిచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. ఏప్రిల్‌ 3 నుంచి బెంగళూరులో రెండు రోజులపాటు జరిగే పార్టీ జాతీయ కార్యవర్గ భేటీ అనంతరం మంత్రివర్గ విస్తరణపై మోడీ దృష్టి సారించే అవకాశముందని తెలుస్తోంది. ఈసారి మిత్రపక్షాలైన పీడీపీ, శివసేనకు కేబినెట్‌ బెర్తులు లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. పీడీపీ నుంచి మహబూబా ముఫ్తీకి, గత విస్తరణ సమయంలో కేబినెట్‌ నుంచి బయటకు వచ్చిన శివసేన సభ్యుడు అనిల్‌ దేశాయికి అవకాశం లభించవచ్చు. తాజా విస్తరణలో బాగా పనిచేసే వారికి తగిన గుర్తింపు ఇవ్వడంతోపాటు పనితీరు సరిగా లేని మంత్రులను తొలగించాలని ఆయన భావిస్తున్నారు. ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హాకు అదనంగా కార్పొరేట్‌ వ్యవహారాలను అప్పగించే అవకాశముంది. సహాయ మంత్రిగా ఉన్న ముక్తార్‌ అబ్బాస్‌ నక్వికి స్వతంత్ర హోదా లభించనుంది.-పిఆర్‌-
First Published:  31 March 2015 6:02 AM GMT
Next Story