జూన్‌ 15లోపు మున్సిపల్‌ ఎన్నికలు: ప్రత్తిపాటి

రాష్ట్రంలో వివిధ కారణాల వలన నిలిచిపోయిన మున్సిపల్‌, నగరపాలక సంస్థల ఎన్నిక‌ల‌ను జూన్‌15లోపు నిర్వహించాలని ప్రభు త్వం నిర్ణయించినట్లు వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. కొన్ని మున్సిపల్‌, నగరపాలక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతున్నట్లు ఆయన చెప్పారు. గుంటూరులోమం త్రి విలేకరులతో మాట్లాడుతూ గుంటూరు, ఒంగోలు, విశాఖ వంటి నగరపాలక సంస్థలకు ఎక్కువ కాలం ప్రత్యేక అధికారుల పాలన ఉండటం మంచిది కాదన్నారు. ఇదిలా ఉండగా గుంటూరు లాంఫారంలో ఏప్రిల్‌లో వ్యవసాయ వర్సిటీకి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి చెప్పారు.-పిఆర్‌