టీడీపీ సభ్యులతో ఘ‌ర్ష‌ణ‌లో వైకాపా నాయ‌కుడు మృతి

అనంత‌పురం జిల్లాలో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో వైకాపా నాయ‌కుడు ఒక‌రు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. జిల్లాలోని పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు సొసైటీలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. సొసైటీలో అవిశ్వాసంపై తీర్మానం సందర్భంగా టీడీపీ- వైసీపీ వర్గీయుల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకుంది. మాటామాటా పెరిగి పరస్పరం కర్రలతో దాడులకు దిగారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి అక్కడికక్కడే దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు. కిష్టిపాడు సొసైటీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ  కొంతకాలంగా రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంగ‌ళ‌వారంనాటి సమావేశానికి ఇరువర్గాలకు చెందిన సభ్యులు హాజరయ్యారు. పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నించినప్పటికీ ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది.  ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో వైకాపా నాయ‌కుడు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు.-పిఆర్‌