Telugu Global
Cinema & Entertainment

భీమనేని, బెల్లంకొండ శ్రీనివాస్ ల  చిత్రం ప్రారంభం

ఎన్నో రీమేక్ చిత్రాలని సక్సెస్ ఫుల్ చిత్రాలుగా మలచిన భీమనేని దర్శకత్వంలో, అల్లుడుశీను లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో హీరోగా పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో నూతన చిత్రం పూజ కార్యక్రమాలు ఫిల్మ్ నగర్ సాయిబాబా దేవాలయంలో  జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ ఇవ్వగా, మరో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత పోకూరి బాబురావు కెమేరా స్విచ్ ఆన్ చేయగా షిర్డి సాయిబాబా విగ్రహంపై తొలిషాట్ చిత్రీకరణ జరిగింది. […]

భీమనేని, బెల్లంకొండ శ్రీనివాస్ ల  చిత్రం ప్రారంభం
X

ఎన్నో రీమేక్ చిత్రాలని సక్సెస్ ఫుల్ చిత్రాలుగా మలచిన భీమనేని దర్శకత్వంలో, అల్లుడుశీను లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో హీరోగా పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో నూతన చిత్రం పూజ కార్యక్రమాలు ఫిల్మ్ నగర్ సాయిబాబా దేవాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ ఇవ్వగా, మరో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత పోకూరి బాబురావు కెమేరా స్విచ్ ఆన్ చేయగా షిర్డి సాయిబాబా విగ్రహంపై తొలిషాట్ చిత్రీకరణ జరిగింది. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు హాజరై యూనిట్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. దర్శకుడు భీమనేని సొంత సంస్థ ‘గుడ్ విల్ సినిమా’ బ్యానర్ పై నిర్మాణం కానున్న ఈ చిత్రం ఏప్రిల్ 16 నుండి మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించి మే, జూన్ , జులై నెలల్లో సినిమా మొత్తం పూర్తి చేస్తామని, ఆగస్ట్ 28న చిత్రాన్ని విడుదల చేయనున్నామని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల తెలియజేశారు. తమిళ్ లో ‘సుందర్ పాండియన్’ గా, కన్నడలో ‘రాజహులి’ గా విడుదలై రెండు భాషల్లోనూ శతదినోత్సవాలు జరుపుకుని నిర్మాతలకి, పంపిణిదారులకి కనక వర్షం కురిపించిన కథకి ఇది తెలుగు రీమేక్ అని, మన ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మలిచామని, ‘సుడిగాడు’ తర్వాత తనకిది మరో బ్లాక్ బస్టర్ గా నిలిచే చిత్రమని దర్శకుడు భీమనేని తెలియజేశారు.

ఈ చిత్రానికి కథ-ఎస్.ఆర్. ప్రభాకరన్ , మాటలు- భీమనేని శ్రీనివాస్ రావు , ప్రవీణ్ , కెమేరా -విజయ్ ఉలగనాథ్, సంగీతం- శ్రీ వసంత్ ,
ఎడిటింగ్- గౌతంరాజు , ఆర్ట్ – కిరణ్ కుమార్ పబ్లిసిటి డిజైనర్ – ధని ఏలె, కాస్టూమ్స్ -శివ ,ఖాదర్, స్టిల్స్ – కటారి
కో డైరెక్టర్ -రాంగోపాల్ చౌదరి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ – బండిశేషయ్య,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వివేక్ కూచిభొట్ల, సమర్పణ- భీమనేని రోషితా సాయి
మాటలు-స్ర్కీన్ ప్లే -దర్శకత్వం- భీమనేని శ్రీనివాస్ రావు, నిర్మాత- భీమనేని సునీత

First Published:  1 April 2015 5:05 AM GMT
Next Story