Telugu Global
NEWS

రవాణా పన్నుపై హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌

ఏపీ నుంచి వచ్చే ప్రైవేటు వాహనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంట్రీ టాక్స్ విధించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో బుధవారం నాడు మూడు లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి. పలువురు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ఈ పిటిషన్లను దాఖలు చేశారు. వీటిపై బుధ‌వార‌మే హైకోర్టులో విచారణ జరుగనుంది. ఇదిలా వుండగా తెలంగాణ ప్రభుత్వం ఎంట్రీ టాక్స్ వసూలు చేయడాన్ని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయమని, దీనివల్ల తెలంగాణ […]

ఏపీ నుంచి వచ్చే ప్రైవేటు వాహనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంట్రీ టాక్స్ విధించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో బుధవారం నాడు మూడు లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి. పలువురు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ఈ పిటిషన్లను దాఖలు చేశారు. వీటిపై బుధ‌వార‌మే హైకోర్టులో విచారణ జరుగనుంది. ఇదిలా వుండగా తెలంగాణ ప్రభుత్వం ఎంట్రీ టాక్స్ వసూలు చేయడాన్ని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయమని, దీనివల్ల తెలంగాణ ప్ర‌భుత్వానికి నెల‌కు దాదాపు రూ. 40 కోట్ల రూపాయ‌లు వ‌సూల‌య్యే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ ఇదంతా ప్రజల మీద అదనపు భారం కాక త‌ప్ప‌ద‌ని అసోసియేషన్ సభ్యులు చెప్పారు. అదేవిధంగా మంగళవారం అర్ధరాత్రి నుంచే తెలంగాణలో ప్రవేశిస్తున్న వాహనాలపై రవాణాపన్ను వసూలు చేయ‌డం మొద‌లుపెట్టారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుఝాము వరకు నల్గొండ జిల్లాలోని మూడు చెక్‌పోస్టుల దగ్గర వంద‌లాది వాహ‌నాల నుంచి ర‌వాణా ప‌న్ను వ‌సూలు చేశారు.-పిఆర్‌
First Published:  1 April 2015 2:43 AM GMT
Next Story