Telugu Global
Cinema & Entertainment

లిప్ లాక్‌లో చిరంజీవి ఇబ్బందిపడ్డార‌ట‌!

మెగాస్టార్ చిరంజీవి గురించి ఓ ర‌హ‌స్యం చెప్పింది హీరోయిన్ నగ్మా. ‘ఘరానా మొగుడు’ సినిమా చిత్రీకరణలో భాగంగా లిప్‌లాక్ సీన్లు చేయాల్సి వ‌చ్చిన‌పుడు చిరంజీవి చాలా ఇబ్బందిపడ్డారని, నిజానికి సరిగా చేయలేకపోయారని గుట్టువిప్పింది. ఆ సీన్ సరిగా రాకపోవడంతో ఎడిటింగ్‌లో తీసేశార‌ని త‌న‌కు తెలిసిన నిజం బయటపెట్టింది. బుల్లితెరపై ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్పిస్తున్న‌ ‘సౌందర్య లహరి’ కార్యక్రమంలో భాగంగా నగ్మా స్పెషల్ గెస్ట్‌గా ఆ కార్య‌క్ర‌మానికి హాజరైంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోల అందరి సరసన నటించిన ఈమె, […]

లిప్ లాక్‌లో చిరంజీవి ఇబ్బందిపడ్డార‌ట‌!
X
మెగాస్టార్ చిరంజీవి గురించి ఓ ర‌హ‌స్యం చెప్పింది హీరోయిన్ నగ్మా. ‘ఘరానా మొగుడు’ సినిమా చిత్రీకరణలో భాగంగా లిప్‌లాక్ సీన్లు చేయాల్సి వ‌చ్చిన‌పుడు చిరంజీవి చాలా ఇబ్బందిపడ్డారని, నిజానికి సరిగా చేయలేకపోయారని గుట్టువిప్పింది. ఆ సీన్ సరిగా రాకపోవడంతో ఎడిటింగ్‌లో తీసేశార‌ని త‌న‌కు తెలిసిన నిజం బయటపెట్టింది. బుల్లితెరపై ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్పిస్తున్న‌ ‘సౌందర్య లహరి’ కార్యక్రమంలో భాగంగా నగ్మా స్పెషల్ గెస్ట్‌గా ఆ కార్య‌క్ర‌మానికి హాజరైంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోల అందరి సరసన నటించిన ఈమె, చిత్రీకరణ సమయంలో నటీనటులు పడిన కొన్ని విషయాల గురించి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. ముఖ్యంగా చిరంజీవి- నగ్మా కాంబినేషన్‌లో వచ్చిన ఘరానా మొగుడు, మోహన్‌బాబు – నగ్మా జంటగా వచ్చిన ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రాల్లో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన‌ విషయాలను బయటపెట్టింది. హీరో మోహన్‌బాబును ఫన్నీ మేన్‌గా వర్ణించింది నగ్మా. చిరంజీవి చాలా మంచివారని చెబుతూ, బాలకృష్ణ (అశ్వమేథం)ను కృష్ణుడితోను, వెంకీ (సరదా బుల్లోడు)ని సెంటిమెంటల్ పర్సన్ అని, నాగార్జున( అల్లరి అల్లుడు) మంచి ఫ్రెండ్‌గాను అభివర్ణించింది. మొత్తం మీద ఈ హీరోయిన్‌కి మ‌న‌సులో మాటలు బ‌య‌ట పెట్ట‌డానికి ‘సౌందర్య లహరి’ కార్య‌క్ర‌మం వేదికైంది.-పిఆర్‌
First Published:  1 April 2015 1:00 AM GMT
Next Story