Telugu Global
NEWS

టి- ఎంట్రీ ట్యాక్స్‌ ఒప్పుకోం... ఏపీ వ్యాప్తంగా లారీ యజమానుల ఆందోళన

తెలంగాణ ప్రభుత్వం విధించిన ఎంట్రీ ట్యాక్స్‌పై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మరోవైపు ఎంట్రీ ట్యాక్స్‌ చెల్లించలేక ఆంధ్ర‌వైపు నుంచి తెలంగాణ‌ సరిహద్దుల్లోను, మ‌రోవైపు రాయ‌ల‌సీమ స‌రిహ‌ద్దు నుంచి బెంగళూరు – హైదరాబాద్‌ రహదారిలోను వాహ‌నాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ఏపీ, తెలంగాణ సరిహద్దులో నల్గొండ జిల్లా కోదాడ సమీపంలోని నల్లబండ గూడెం చెక్‌పోస్టు వద్ద పలువురు లారీ ట్రాన్స్‌పోర్టు యజమానులు నిరసనకు దిగారు. పన్ను చెల్లించని వాహనాలను అధికారులు చెక్‌పోస్టు వద్దే నిలిపివేశారు. లారీ […]

తెలంగాణ ప్రభుత్వం విధించిన ఎంట్రీ ట్యాక్స్‌పై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మరోవైపు ఎంట్రీ ట్యాక్స్‌ చెల్లించలేక ఆంధ్ర‌వైపు నుంచి తెలంగాణ‌ సరిహద్దుల్లోను, మ‌రోవైపు రాయ‌ల‌సీమ స‌రిహ‌ద్దు నుంచి బెంగళూరు – హైదరాబాద్‌ రహదారిలోను వాహ‌నాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ఏపీ, తెలంగాణ సరిహద్దులో నల్గొండ జిల్లా కోదాడ సమీపంలోని నల్లబండ గూడెం చెక్‌పోస్టు వద్ద పలువురు లారీ ట్రాన్స్‌పోర్టు యజమానులు నిరసనకు దిగారు. పన్ను చెల్లించని వాహనాలను అధికారులు చెక్‌పోస్టు వద్దే నిలిపివేశారు. లారీ డ్రైవర్లు, యజమానులు.. తాము మూడు రోజుల కిందటే సరుకులతో ఇతర ప్రాంతాలకు వెళ్లామని, సుంకం చెల్లింపునకు త‌మ వ‌ద్ద డబ్బులు లేవని అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. పన్ను చెల్లించిన తర్వాతే వాహనాలను తీసుకెళ్లాలని అధికారులు తేల్చి చెప్పడంతో వారు చెక్‌పోస్టు వద్ద నిరసనకు దిగారు. డ‌బ్బుల్లేక ప‌న్ను చెల్లించ‌లేని వాహ‌నాల డ్రైవ‌ర్లు రెండు రోజుల నుంచి చెక్‌పోస్టుల వ‌ద్దే ప‌డిగాపులు కాస్తున్నా అధికారులు స్పందించ‌డం లేదు.
First Published:  1 April 2015 9:08 PM GMT
Next Story