Telugu Global
NEWS

సూర్యాపేట‌లో కాల్పులు... బాధిత కుటుంబాల‌కు రూ.10 ల‌క్ష‌ల ప‌రిహారం

సూర్యాపేట హైటెక్‌ బస్టాండ్‌లో కొంద‌రు దొంగ‌లు జ‌రిపిన కాల్పుల్లో చనిపోయిన గన్ మెన్ లింగయ్య (36) హోంగార్డు మహేష్ (35) కుటుంబాల‌కు  ప్ర‌భుత్వం ప‌రిహారాన్ని ప్ర‌క‌టించింది. చ‌నిపోయిన ఈ ఇద్ద‌రి కుటుంబాల‌కు రూ. 10 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం చెల్లించ‌నుంది. ఇది కాకుండా వారికి రావాల్సిన ఇత‌ర బెనిఫిట్స్ కూడా వ‌స్తాయ‌ని తెలంగాణ‌ డీజీపీ అనురాగ్‌శ‌ర్మ‌ అన్నారు. రెండు కుటుంబాల్లో ఒక్కొక్క‌రికి ఉద్యోగం కూడా ఇస్తామ‌ని అన్నారు.  నల్గొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండులో నిన్న అర్ధరాత్రి […]

సూర్యాపేట‌లో కాల్పులు... బాధిత కుటుంబాల‌కు రూ.10 ల‌క్ష‌ల ప‌రిహారం
X
సూర్యాపేట హైటెక్‌ బస్టాండ్‌లో కొంద‌రు దొంగ‌లు జ‌రిపిన కాల్పుల్లో చనిపోయిన గన్ మెన్ లింగయ్య (36) హోంగార్డు మహేష్ (35) కుటుంబాల‌కు ప్ర‌భుత్వం ప‌రిహారాన్ని ప్ర‌క‌టించింది. చ‌నిపోయిన ఈ ఇద్ద‌రి కుటుంబాల‌కు రూ. 10 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం చెల్లించ‌నుంది. ఇది కాకుండా వారికి రావాల్సిన ఇత‌ర బెనిఫిట్స్ కూడా వ‌స్తాయ‌ని తెలంగాణ‌ డీజీపీ అనురాగ్‌శ‌ర్మ‌ అన్నారు. రెండు కుటుంబాల్లో ఒక్కొక్క‌రికి ఉద్యోగం కూడా ఇస్తామ‌ని అన్నారు. నల్గొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండులో నిన్న అర్ధరాత్రి పోలీసులు తనికీలు నిర్వహిస్తున్న సమయంలో విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతున్న బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు దుండగులు వారిపై కాల్పులు జరపడంతో మరణించారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయ‌ప‌డిన సీఐ మొగిలయ్యకు మెరుగైన వైద్య చికిత్స అందించాల్సిందిగా ప్ర‌భుత్వం ఆదేశించింది. గాయ‌ప‌డిన హోంగార్డు కిషోర్‌కు, దొర‌బాబుకు హైద‌రాబాద్‌లోని కిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. మొగిల‌య్యకు ఇంకా రెండు బుల్లెట్‌లు శ‌రీరంలోనే ఉన్నాయి. ఆప‌రేష‌న్ చేసి వీటిని తొల‌గించే ప‌నిలో ఉన్న‌ట్టు కిమ్స్ వైద్యులు తెలిపారు. ఈ సంగతి తెలుసుకొన్న సూర్యాపేట పోలీసులు హుటాహుటిన అక్కడికి తరలివచ్చేరు. కానీ అప్పటికే దుండగులు తప్పించుకొని పారిపోయారు. పారిపోతూ పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను కూడా పట్టుకుపోయారు. హైదరాబాద్ వెళ్ళే దారిలో ఉన్న అన్ని చెక్ పోస్టులను పోలీసులు అప్రమత్తం చేసి దుండగులను పట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనా స్థలంలో దొరికిన ఆధార్ కార్డ్ ప్రకారం దుండగులు బీహార్ రాష్ట్రానికి చెందినవారని పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. దీనికోసం కొంత‌మంది పోలీసుల‌తో ప్ర‌త్యేక బృందాలు ఏర్పాటు చేశారు.-పిఆర్‌
First Published:  2 April 2015 1:41 AM GMT
Next Story