Telugu Global
Business

కెన‌రా బ్యాంకులో రూ.15 కోట్ల స్కాం

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా చాట‌ప‌ర్రు కెన‌రా బ్యాంకులో భారీ కుంభ‌కోణం చోటు చేసుకుంది. జిల్లాలోని భీమ‌వ‌రం, ఆకివీడు ప్రాంతాల్లో త‌మ‌కు చేప‌ల చెరువులున్న‌ట్టు న‌మ్మించి బినామీలు భారీగా రుణాలు తీసుకున్నారు. ఈ అక్ర‌మాల‌కు బ్యాంకు మేనేజ‌ర్‌తోపాటు కొంత‌మంది సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో స‌హ‌కారం అందించారు. మొత్తం ఈ కుంభ‌కోణంలో ముఫ్పై మందికి భాగ‌స్వామ్య‌మున్న‌ట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. న‌కిలీ ప‌త్రాల‌తో దాదాపు ముప్సై మంది రూ. 15 కోట్ల వ‌ర‌కు రుణాలు పొందిన‌ట్లు తెలుస్తోంది. విష‌యం […]

కెన‌రా బ్యాంకులో రూ.15 కోట్ల స్కాం
X
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా చాట‌ప‌ర్రు కెన‌రా బ్యాంకులో భారీ కుంభ‌కోణం చోటు చేసుకుంది. జిల్లాలోని భీమ‌వ‌రం, ఆకివీడు ప్రాంతాల్లో త‌మ‌కు చేప‌ల చెరువులున్న‌ట్టు న‌మ్మించి బినామీలు భారీగా రుణాలు తీసుకున్నారు. ఈ అక్ర‌మాల‌కు బ్యాంకు మేనేజ‌ర్‌తోపాటు కొంత‌మంది సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో స‌హ‌కారం అందించారు. మొత్తం ఈ కుంభ‌కోణంలో ముఫ్పై మందికి భాగ‌స్వామ్య‌మున్న‌ట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. న‌కిలీ ప‌త్రాల‌తో దాదాపు ముప్సై మంది రూ. 15 కోట్ల వ‌ర‌కు రుణాలు పొందిన‌ట్లు తెలుస్తోంది. విష‌యం తెలిసిన వెంట‌నే చాట‌ప‌ర్రు కెన‌రా బ్యాంక్ మేనేజ‌ర్ ర‌వి కుమార్‌ను సస్పెండ్ చేశారు. దీనిపై లోతైన విచార‌ణ జ‌రిపితే మ‌రిన్ని విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయ‌ని భావిస్తున్నారు.-పిఆర్‌
First Published:  2 April 2015 3:51 AM GMT
Next Story