Telugu Global
Cinema & Entertainment

మూవీ రివ్యూ: అవును-2 

రేటింగ్: 1.75/5 ప్లస్ పాయింట్స్: రీరికార్డింగ్ పూర్ణ యాక్టింగ్, గ్లామర్ మైనస్ పాయింట్స్: కథ, కథనం ఎడిటింగ్ మోహిని (పూర్ణ) పై మనసుపడిన శ్రీను (రవిబాబు) చనిపోయి ఆత్మగా మారుతాడు. కన్యగా ఉండగానే మోహినిని పొందాలనుకునే శ్రీను ఆత్మ ఆమెను వెంబడిస్తూ ఉంటుంది. మోహినిపై ఆశ పెంచుకున్న శ్రీను ఆత్మ ఎవరో ఒక శరీరంలోకి ప్రవేశిస్తుంటుంది.  హర్ష, మోహిని దంపతుల శోభనం రోజే అనుకోని సంఘటన జరుగుతుంది. శ్రీను జ్ఞాపకాలకు దూరంగా ఉండాలని వేరే ప్రదేశానికి షిఫ్ట్ అయి. వేరే ఫ్లాట్లోకి మారుతారు. ఆ ఫ్లాట్ లో శ్రీను ఆత్మ […]

మూవీ రివ్యూ: అవును-2 
X
రేటింగ్: 1.75/5
ప్లస్ పాయింట్స్: రీరికార్డింగ్ పూర్ణ యాక్టింగ్, గ్లామర్
మైనస్ పాయింట్స్: కథ, కథనం ఎడిటింగ్
మోహిని (పూర్ణ) పై మనసుపడిన శ్రీను (రవిబాబు) చనిపోయి ఆత్మగా మారుతాడు. కన్యగా ఉండగానే మోహినిని పొందాలనుకునే శ్రీను ఆత్మ ఆమెను వెంబడిస్తూ ఉంటుంది. మోహినిపై ఆశ పెంచుకున్న శ్రీను ఆత్మ ఎవరో ఒక శరీరంలోకి ప్రవేశిస్తుంటుంది. హర్ష, మోహిని దంపతుల శోభనం రోజే అనుకోని సంఘటన జరుగుతుంది. శ్రీను జ్ఞాపకాలకు దూరంగా ఉండాలని వేరే ప్రదేశానికి షిఫ్ట్ అయి. వేరే ఫ్లాట్లోకి మారుతారు. ఆ ఫ్లాట్ లో శ్రీను ఆత్మ ఎవరెవరిలో ప్రవేశించింది? ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి? చివరకు ఏమైందనదే అవును-2 కథ.
చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన హర్షవర్ధన్ రాణే, పూర్ణలు ఈ చిత్రంలో ఓ మోస్తారు పాత్రలేనే పోషించారు. హర్షవర్ధన్ రాణే, పూర్ణల మద్య కెమిస్ట్రీ బాగానే పండింది. మిగితా పాత్రల్లో కనిపించిన నిఖిత, సంజనాలు, రవిబాబు, ప్రభాస్ శ్రీనులకు అంతగా ప్రాధాన్యం ఏమిలేదు. కధానుగుణంగా అలా వచ్చి పోయే పాత్రలే.సాంకేతిక విభాగాల్లో కెమెరా పనితనం పర్వాలేదనిపించే రేంజ్ లో ఉంది. హారర్ చిత్రానికి సరిపడే విధంగా కథ పరిధి మేరకు శేఖర్ చంద్ర అందించిన సంగీతం పర్వాలేదనిపించింది. ఎడిటింగ్ విభాగంలో లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి.
ఇక రవిబాబు దర్శకత్వ ప్రతిభ ఆశించినంత మేరకు లేకపోవడం ప్రధానమైన లోపం. కథలో కొత్తదనం లేకపోవడం, కథనం రొటిన్ గా ఉండటం నిరాశపరిచే అంశాలు. ఈ చిత్రంలో హారర్ అంశాల కంటే శృంగారంపైనే ఎక్కువ దృష్టిని పెట్టినట్లుంది. కథను గాలికొదిలేసి.. మేకింగ్ పైనే దృష్టి పెడితే ఎలాంటి ఫలితం కనిపిస్తుందో అవును-2 చిత్రాన్ని చూసి చెప్పవచ్చు. అక్కడక్కడా దర్శకుడి ప్రతిభ ఆకట్టుకునే విధంగా ఉన్నా.. పూర్తిస్థాయిలో సినిమాను విజయం వైపు నడిపించే సత్తా కనిపించదు. అన్ని కోణాల నుంచి ఓ సారి పరిశీలిస్తే సగటు ప్రేక్షకుడి అభిరుచి దూరంగా ఈ చిత్రం ఉందనే అభిప్రాయం కలుగమానదు. యూత్, హారర్ చిత్రాలను ఆదరించే ప్రేక్షకులతోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరించడంపైనే అవును-2 చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది. నిర్మాణ విలువలు సురేశ్ ప్రొడక్షన్ స్థాయికి లేకపోవడం మరో మైనస్ పాయింట్.
నటీనటులు: హర్షవర్ధన్ రాణే, పూర్ణ, రవిబాబు, నిఖిత, సంజన, ప్రభాస్ శ్రీను తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
నిర్మాతలు, రవిబాబు, డీ సురేశ్ బాబు
దర్శకత్వం: రవిబాబు
First Published:  3 April 2015 12:10 AM GMT
Next Story