Telugu Global
National

ద‌క్షిణాదిలో అధికార‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ బీజేపీ 

ద‌క్షిణాదిలో పార్టీ బ‌లోపేత‌మే ల‌క్ష్యంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ పావులు క‌దుపుతోంది. ఇందులో భాగంగానే జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల‌ను క‌ర్ణాట‌క రాష్ట్రంలోని బెంగుళూరులో నిర్వ‌హిస్తున్నారు. పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి రాబోయే రోజుల్లో 15 వేల మంది కార్య‌క‌ర్త‌ల‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్టు బీజేపీ అధినేత అమిత్ షా ప్ర‌క‌టించారు. కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళ‌డం, పార్టీ ప్ర‌జ‌ల‌కు చేరువ చేయ‌డం ఈ కార్య‌క‌ర్త‌ల ల‌క్ష్యంగా ఉంటుంద‌ని ఆయ‌న చెప్పారు. భూ సేక‌ర‌ణ బిల్లుపై ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను […]

ద‌క్షిణాదిలో అధికార‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ బీజేపీ 
X
ద‌క్షిణాదిలో పార్టీ బ‌లోపేత‌మే ల‌క్ష్యంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ పావులు క‌దుపుతోంది. ఇందులో భాగంగానే జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల‌ను క‌ర్ణాట‌క రాష్ట్రంలోని బెంగుళూరులో నిర్వ‌హిస్తున్నారు. పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి రాబోయే రోజుల్లో 15 వేల మంది కార్య‌క‌ర్త‌ల‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్టు బీజేపీ అధినేత అమిత్ షా ప్ర‌క‌టించారు. కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళ‌డం, పార్టీ ప్ర‌జ‌ల‌కు చేరువ చేయ‌డం ఈ కార్య‌క‌ర్త‌ల ల‌క్ష్యంగా ఉంటుంద‌ని ఆయ‌న చెప్పారు. భూ సేక‌ర‌ణ బిల్లుపై ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను తిప్పి కొడ‌తామ‌ని, ఎన్డీయే ప్ర‌భుత్వం ఏం చేసినా అది జ‌న‌హిత‌మే ల‌క్ష్యంగా ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. శుక్ర‌, శ‌నివారాల్లో జ‌రిగే ఈ స‌మావేశాల‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడి, పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ఎల్‌.కె.అద్వానీ, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్య‌మంత్రులు, సీనియ‌ర్ నాయ‌కులు హాజ‌ర‌య్యారు.-పీఆర్‌
First Published:  3 April 2015 5:42 AM GMT
Next Story