Telugu Global
Others

విమ‌ల‌క్క‌పై కుట్ర కేసు న‌మోదు!

తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కో-ఛైర్మ‌న్‌, అరుణోద‌య గాయ‌ని విమ‌ల‌క్క‌, ఆమె భ‌ర్త అమ‌ర్ త‌దిత‌రుల‌పై నిజామాబాద్ జిల్లా మాచారెడ్డిలో కుట్ర కేసు న‌మోదైంది. ఇలాంటి కేసు పెట్ట‌డం ద్వారా ఆట‌, పాట‌ల‌తో ప్ర‌జా చైత‌న్యాన్ని పెంపొందించ‌డం కుద‌ర‌ద‌న్న సంకేతాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ఇస్తోంది. కుట్ర కేసులు, ఆయుధాల కేసులు పెట్ట‌డం ద్వారా ప్ర‌జా సంఘాల‌పై వేధింపుల‌కు శ్రీ‌కారం చుట్టింది. అస‌లేం జ‌రిగిందో తెలిస్తే… అంద‌రూ ముక్కున వేలేసుకుంటారు. విమ‌ల‌క్క సార‌థ్యంలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్‌( (((ట‌ఫ్) బీడీ […]

విమ‌ల‌క్క‌పై కుట్ర కేసు న‌మోదు!
X
తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కో-ఛైర్మ‌న్‌, అరుణోద‌య గాయ‌ని విమ‌ల‌క్క‌, ఆమె భ‌ర్త అమ‌ర్ త‌దిత‌రుల‌పై నిజామాబాద్ జిల్లా మాచారెడ్డిలో కుట్ర కేసు న‌మోదైంది. ఇలాంటి కేసు పెట్ట‌డం ద్వారా ఆట‌, పాట‌ల‌తో ప్ర‌జా చైత‌న్యాన్ని పెంపొందించ‌డం కుద‌ర‌ద‌న్న సంకేతాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ఇస్తోంది. కుట్ర కేసులు, ఆయుధాల కేసులు పెట్ట‌డం ద్వారా ప్ర‌జా సంఘాల‌పై వేధింపుల‌కు శ్రీ‌కారం చుట్టింది. అస‌లేం జ‌రిగిందో తెలిస్తే… అంద‌రూ ముక్కున వేలేసుకుంటారు. విమ‌ల‌క్క సార‌థ్యంలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్‌( (((ట‌ఫ్) బీడీ కార్మికుల ఉద్య‌మంలో చురుగ్గా పాల్గొంటుంది. మార్చి 23న భ‌గ‌త్‌సింగ్ వ‌ర్ధింతి సంద‌ర్భంగా బీడీ కార్మికుల స‌మ‌స్య‌ల‌పై నిజామాబాద్ జిల్లా మాచారెడ్డిలో బ‌హిరంగ‌స‌భ నిర్వ‌హించారు. దీనికి ట‌ఫ్ కార్య‌క‌ర్త‌లు, అరుణోద‌య స‌భ్యులు, ఎఐఎఫ్‌టియు, అనుబంధ శ్రామిక‌శ‌క్తి బీడీ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. సామ్రాజ్య‌వాదుల కోస‌మే కేసీఆర్ నిధుల‌ను త‌ర‌లిస్తున్నార‌ని ఆమె వేదిక‌పై గ‌ళం విప్పారు. స‌భ ప్ర‌శాంతంగా జ‌రిగింది. అంద‌రూ హాయిగా వెళ్ళిపోయారు.
మ‌రునాడు రంగంలోకి దిగారు పోలీసులు. ఉద్య‌మ నాయ‌క‌త్వం, స‌భ నిర్వ‌హ‌ణ వంటి విష‌యాల‌పై ఆరా తీశారు. ఈ నేప‌థ్యంలో నిజామాబాద్ బీడీ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ నాయ‌కులు వెంక‌ట‌ల‌క్ష్మీ, అన‌సూయ‌, లింగ‌య్య‌ల‌ను అరెస్ట్ చేశారు. వీరి విడుద‌ల కోసం జిల్లా ఎస్పీని క‌లిసి ప్ర‌య‌త్నించారు విమ‌ల‌క్క‌. నిజామాబాద్ ఎంపీ క‌విత‌తో కూడా మాట్లాడే ప్ర‌య‌త్నం చేశారు. ఈ ప్ర‌య‌త్నాలు సాగుతుండ‌గానే గ‌త నెల 26న విమ‌ల‌క్క‌కు నిజామాబాద్ పోలీసులు ఫోన్ చేశారు. మీ మీద కుట్ర‌, ఆయుధాల కేసు న‌మోదు చేశాం అని చెప్పారు. దాంతో ఆశ్చ‌ర్య‌పోవ‌డం విమ‌ల‌క్క వంతయ్యింది. మాచారెడ్డి స‌భ కాస్తా మాచారెడ్డి కుట్ర కేసుగా మారిపోయింది. విమ‌ల‌క్క‌తోపాటు ఆమె భ‌ర్త అమ‌ర్‌, జ‌న‌శ‌క్తి అగ్ర‌నేత రాజ‌న్నతో పాటు 17 మందిపై కుట్ర‌, మార‌ణాయుధాల అభియోగాల‌పై కేసు న‌మోదైంది.-పీఆర్‌
First Published:  3 April 2015 1:44 AM GMT
Next Story