Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 27

తాడు చెడిపోయిన ట్రక్కును తాడుతో కట్టి యింకో ట్రక్కు లాక్కుపోతూవుంటే చూసిన ఒకతను ‘ఒక తాడును తీసుకెళ్ళడానికి రెండు ట్రక్కులా’ అని ఆశ్చర్యపోయాడు! ************ వీరుడు ‘టీచర్‌ పిల్లల్తో ‘ఎవరైనా తోడేలును ముఖాముఖీ ఎదుర్కొన్నారా!’ అని అడిగింది. ఒక కుర్రాడు చేయిపైకి ఎత్తాడు… అతని అనుభవం చెప్పాడు ‘సమీపంలో ఎవరూ లేరు. తోడేలు ముందుకు వస్తోంది. నేను దాని కళ్లలో కళ్లు ఉంచాను. యింకా ముందుకు వచ్చింది. దాదాపు నా దగ్గరకొచ్చింది. ‘ టీచర్‌ ఆశ్చర్యంతో ‘మరి […]

తాడు
చెడిపోయిన ట్రక్కును తాడుతో కట్టి యింకో ట్రక్కు లాక్కుపోతూవుంటే చూసిన ఒకతను
‘ఒక తాడును తీసుకెళ్ళడానికి రెండు ట్రక్కులా’ అని ఆశ్చర్యపోయాడు!
************
వీరుడు
‘టీచర్‌ పిల్లల్తో ‘ఎవరైనా తోడేలును ముఖాముఖీ ఎదుర్కొన్నారా!’ అని అడిగింది. ఒక కుర్రాడు చేయిపైకి ఎత్తాడు… అతని అనుభవం చెప్పాడు
‘సమీపంలో ఎవరూ లేరు. తోడేలు ముందుకు వస్తోంది. నేను దాని కళ్లలో కళ్లు ఉంచాను. యింకా ముందుకు వచ్చింది. దాదాపు నా దగ్గరకొచ్చింది.
‘ టీచర్‌ ఆశ్చర్యంతో ‘మరి ఎట్లా తప్పించుకున్నావు?’
‘నేనున్నది జూలో. ఆ బోను దగ్గర్నించీ యింకో బోను దగ్గరకు వెళ్లిపోయాను’ అన్నాడు

************
నవ్వుల నాటకం
నాటకం దారుణంగా ఉంది. మొదటి రోజు కాబట్టి జనం వచ్చారు. నటుల నటన ఏమీ బాగా లేదు. నాటకంలో కథ లేదు. ప్రేక్షకులకు బాగా బోరుకొట్టింది. అరుపులు, ఈలలు మొదలయ్యాయి.
రంగస్థలంపై హీరో హీరోయిన్‌ ప్రేమ సీన్‌.
హీరో హీరోయిన్‌ని చూసి ”డార్లింగ్‌! నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వంటే నాకు ప్రాణం” అన్నాడు.
హీరోయిన్‌ ”డార్లింగ్‌! నేనుకూడా నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వంటే నాక్కూడా ప్రాణం” అంది.
హీరో అటూ ఇటూ చూసి ”డార్లింగ్‌! చివరికి మనం కలుసుకున్నాం. ఎవ్వరూ లేరు. మనిద్దరమే వున్నాం. నా దగ్గరికి రా” అన్నాడు.
గ్యాలరీ నించి ఎవరో ”ఒరే! ఈ రోజు మేమంతా వున్నాం. ఈ చెత్త నాటకానికి రేపయితే మీ యిద్దరే వుంటారు. అప్పుడు చూసుకోండి” అన్నాడు.
నాటకశాల అంతా నవ్వుల్తో నిండిపోయింది.
************
చందా
ఒకమ్మాయి చందాలకోసం వచ్చింది. ఆ యింట్లో వృద్ధుడున్నాడు. అతనా అమ్మాయితో
‘చందా ఎందుకమ్మా?’ అన్నాడు
ఆ అమ్మాయి ‘దేవుని కివ్వడానికి’ అంది
ఆ వృద్ధుడు ‘నీ వయసెంత?’ అన్నాడు
ఆ అమ్మాయి ‘పందొమ్మిదేళ్లు’ అంది
వృద్ధుడు ‘నా వయసు ఎనభై తొమ్మిది! నీకంటే డెబ్బయి సంవత్సరాలు ఎక్కువ. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్లడానికి చాలా టైముంది. నీకంటే ముందుగా నేనే వెళతాను కదా! నేనే ఆయనకిస్తా, వెళ్లిరా’ అన్నాడు
ఆ అమ్మాయి ముఖం వెలవెల బోయింది

First Published:  3 April 2015 8:00 AM GMT
Next Story