Telugu Global
NEWS

రైతు క్షేమ‌మే థే్యంగా చెరువుల‌పై దీక్ష: కేటీఆర్‌

తెలంగాణ స‌స్య‌శ్యామ‌లంగా చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రి కె. తార‌క రామారావు అన్నారు. అందుకే చెరువుల‌పై దీక్ష చేప‌ట్టామ‌ని, వాటి పూడిక‌లో ప్ర‌జ‌లంద‌రినీ భాగ‌స్వాముల‌ను చేస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. వాట‌ర్‌గ్రిడ్‌పై కేంద్ర మాజీ మంత్రి దిగ్విజ‌య్ సింగ్ చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ అవాస్త‌వ‌మ‌ని, ప్ర‌జ‌లు మొన్న‌టి ఎన్నిక‌ల్లో బుద్ధి చెప్పినా ఇంకా కాంగ్రెస్‌కు జ్ఞ‌నోద‌యం కాలేద‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం మీద‌, టీఆర్ఎస్ నాయ‌కుల‌పైన కొన్ని నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేశార‌ని, ఇది మంచి ప‌ద్ధ‌తి […]

రైతు క్షేమ‌మే థే్యంగా చెరువుల‌పై దీక్ష: కేటీఆర్‌
X
తెలంగాణ స‌స్య‌శ్యామ‌లంగా చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రి కె. తార‌క రామారావు అన్నారు. అందుకే చెరువుల‌పై దీక్ష చేప‌ట్టామ‌ని, వాటి పూడిక‌లో ప్ర‌జ‌లంద‌రినీ భాగ‌స్వాముల‌ను చేస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. వాట‌ర్‌గ్రిడ్‌పై కేంద్ర మాజీ మంత్రి దిగ్విజ‌య్ సింగ్ చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ అవాస్త‌వ‌మ‌ని, ప్ర‌జ‌లు మొన్న‌టి ఎన్నిక‌ల్లో బుద్ధి చెప్పినా ఇంకా కాంగ్రెస్‌కు జ్ఞ‌నోద‌యం కాలేద‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం మీద‌, టీఆర్ఎస్ నాయ‌కుల‌పైన కొన్ని నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేశార‌ని, ఇది మంచి ప‌ద్ధ‌తి కాద‌ని అన్నారు. కాంగ్రెస్ చేసే సిగ్గుమాలిన ప‌నులు అంద‌రూ చేస్తార‌ని అనుకోవ‌డం దిగ్విజ‌య్ అజ్ఞానానికి నిద‌ర్శ‌న‌మ‌ని కేటీఆర్ అన్నారు.జ‌ల‌య‌జ్ఞాన్ని ధ‌న య‌జ్ఞంగా మార్చార‌ని విమ‌ర్శించారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ దేశానికి ప‌ట్టిన శ‌ని అని ఆయ‌న అభివ‌ర్ణించారు. రైతుల సంక్షేమ‌మే త‌మ ప్ర‌భుత్వ విధాన‌మ‌ని, వ్య‌వ‌సాయానికి 9 గంట‌లు విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని మంత్రి హ‌రీష్‌రావు అన్నారు. వ‌‌చ్చే యేడాది 40 వేల ఎక‌రాల‌కు సింగూరు నీరు ఇవ్వాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని మంత్రి తెలిపారు..-పీఆర్‌
First Published:  3 April 2015 6:31 AM GMT
Next Story