Telugu Global
NEWS

ఏపీలో అతి పెద్ద క్రీస్తు విగ్రహం..

నెల్లూరు జిల్లాలో 30 అడుగుల ఏసుక్రీస్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది బ్రెజిల్ లోని రియోడిజినెరోలో ఉన్న విగ్రహం తరహాలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇదే అతి పెద్ద ఏసుక్రీస్తు విగ్రహం అవుతుంది. ఈ విగ్రహాన్ని వైఎంసీఏ మైదాన ప్రాంగణంలో వీఆర్ పీజీ కళాశాల ముందు ఏర్పాటు చేశారు. పూర్తిగా ఫైబర్‌తో తయారు చేసిన ఈ విగ్రహం 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు ఉంటుంది. గుడ్ ఫ్రైడే కానుకగా క్ర్తైస్తవుల కోసం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు […]

నెల్లూరు జిల్లాలో 30 అడుగుల ఏసుక్రీస్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది బ్రెజిల్ లోని రియోడిజినెరోలో ఉన్న విగ్రహం తరహాలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇదే అతి పెద్ద ఏసుక్రీస్తు విగ్రహం అవుతుంది. ఈ విగ్రహాన్ని వైఎంసీఏ మైదాన ప్రాంగణంలో వీఆర్ పీజీ కళాశాల ముందు ఏర్పాటు చేశారు. పూర్తిగా ఫైబర్‌తో తయారు చేసిన ఈ విగ్రహం 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు ఉంటుంది. గుడ్ ఫ్రైడే కానుకగా క్ర్తైస్తవుల కోసం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ శాసనసభ సభ్యుడు ఆనం వివేకానందరెడ్డి తెలిపారు. బ్రెజిల్‌లో ఉన్న ఏసు ప్రభువును చూపించాలనే ఉద్దేశంతోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, విగ్రహం తయారీకి 15 లక్షల వరకు ఖర్చయిందని ఆనం తెలిపారు. గుడ్ ప్రైడే రోజు ఆయ‌న శిలువ మోసి క్రీస్తు ప‌ట్ల త‌న‌కున్న భ‌క్తిభావాన్ని చాటుకున్నారు.-పీఆర్‌
First Published:  4 April 2015 11:53 AM GMT
Next Story