Telugu Global
NEWS

విమ‌ల‌క్క‌పై కేసు... ప్ర‌జాసంఘాల గొంతు నొక్క‌డ‌మే!

తెలంగాణ సాధ‌న కోసం ఒక‌ప్పుడు ఉద్య‌మ‌బాట‌ను ఎంచుకుని ఉవ్వెత్తున ఎగ‌సిన కె.చంద్ర‌శేఖ‌ర‌రావు త‌న ల‌క్ష్యం సాధించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆసీనుల‌య్యారు. ఇలా ఉద్య‌మం చేసిన‌పుడు ఎవ‌రైనా మాటంటే స‌హించేవారు కాదు. కాని ఇపుడు ఇలాంటి ఉద్య‌మం కాక‌పోయినా త‌మ డిమాండ్ల సాధ‌న కోసం బీడీ కార్మికులు చేస్తున్న ఉద్యమాన్ని అణిచివేయ‌డానికి చేస్తున్న ప్ర‌య‌త్నాలు చూస్తే కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు అంద‌రికీ విస్మ‌యం క‌లిగిస్తుంది. కార్మికుల శ్రేయస్సు విషయంలో బీడి కార్మికుల ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న విమలక్కపై ఏకంగా […]

తెలంగాణ సాధ‌న కోసం ఒక‌ప్పుడు ఉద్య‌మ‌బాట‌ను ఎంచుకుని ఉవ్వెత్తున ఎగ‌సిన కె.చంద్ర‌శేఖ‌ర‌రావు త‌న ల‌క్ష్యం సాధించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆసీనుల‌య్యారు. ఇలా ఉద్య‌మం చేసిన‌పుడు ఎవ‌రైనా మాటంటే స‌హించేవారు కాదు. కాని ఇపుడు ఇలాంటి ఉద్య‌మం కాక‌పోయినా త‌మ డిమాండ్ల సాధ‌న కోసం బీడీ కార్మికులు చేస్తున్న ఉద్యమాన్ని అణిచివేయ‌డానికి చేస్తున్న ప్ర‌య‌త్నాలు చూస్తే కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు అంద‌రికీ విస్మ‌యం క‌లిగిస్తుంది. కార్మికుల శ్రేయస్సు విషయంలో బీడి కార్మికుల ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న విమలక్కపై ఏకంగా ఆయుధాలు, కుట్ర‌ కేసు నమోదు చేసింది. విమలక్క తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కోచైర్మన్, అరుణోదయ గాయని. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో చైతన్యం రగిలించిన నేత. అలాంటి నేతపై కేసు పెట్టడంతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ సంఘాలన్నింటిలోనూ కేసిఆర్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసి అన్ని రాజకీయపార్టీలను, ఉద్యమసంఘాలను ఏకతాటిపై నడిపిన తెలంగాణ పొలిటికల్ జేఏసి కూడా ఈ విషయంలో కేసీఆర్ పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్ర‌జా సంఘాల‌ను అణిచివేస్తే దానివ‌ల్ల వాటిల్లే ప‌రిణామాలకు ఆయ‌నే త‌ర్వాత బాధ్య‌త వ‌హించాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది కూడా.-పీఆర్‌
First Published:  4 April 2015 4:00 AM GMT
Next Story