Telugu Global
NEWS

నేడు చంద్రగ్రహణం-శ్రీవారి ఆలయం మూసివేత

చంద్రగ్రహణం సందర్భంగా శనివారం చాలా ఆల‌యాలు మూత ప‌డుతున్నాయి. శ‌నివారం పదిన్నర గంటలపాటు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. మధ్యాహ్నం 3.45 నుంచి రాత్రి 7.15 గంటల వరకు చంద్ర గ్రహణం ఉంటుంది. ఉదయం 9.30 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేసి రాత్రి 8 గంటలకు తెరుస్తారు. అలాగే విజ‌య‌వాడ ఇంద్ర‌కీలాద్రిపై ఉన్న క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని, శ్రీ‌శైలం భ్ర‌మ‌రాంబ మ‌ల్లిఖార్జున స్వామివార్ల ఆల‌యాన్ని, శ్రీ‌కాళ‌హ‌స్తీశ్వ‌రుని ఆల‌యాన్ని కూడా చంద్ర‌గ్ర‌హ‌ణం స‌ద‌ర్భంగా మూసి వేస్తున్నారు. గ్ర‌హ‌ణం ముగిసిన […]

చంద్రగ్రహణం సందర్భంగా శనివారం చాలా ఆల‌యాలు మూత ప‌డుతున్నాయి. శ‌నివారం పదిన్నర గంటలపాటు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. మధ్యాహ్నం 3.45 నుంచి రాత్రి 7.15 గంటల వరకు చంద్ర గ్రహణం ఉంటుంది. ఉదయం 9.30 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేసి రాత్రి 8 గంటలకు తెరుస్తారు. అలాగే విజ‌య‌వాడ ఇంద్ర‌కీలాద్రిపై ఉన్న క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని, శ్రీ‌శైలం భ్ర‌మ‌రాంబ మ‌ల్లిఖార్జున స్వామివార్ల ఆల‌యాన్ని, శ్రీ‌కాళ‌హ‌స్తీశ్వ‌రుని ఆల‌యాన్ని కూడా చంద్ర‌గ్ర‌హ‌ణం స‌ద‌ర్భంగా మూసి వేస్తున్నారు. గ్ర‌హ‌ణం ముగిసిన తర్వాత ఆలయంలో శుద్ధి, సంప్రోక్షణం, పుణ్యాహ వచనం తదితర శాస్త్రోక్త కార్యక్రమాలు నిర్వహించి సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు.-పీఆర్‌
First Published:  3 April 2015 9:00 PM GMT
Next Story