Telugu Global
NEWS

స‌చివాల‌యాల కోసం త‌ర‌లింపుల ప‌ర్వం!

స‌చివాల‌యం నిర్మాణం పేరుతో ఎర్ర‌గ‌డ్డ‌లోని అనేక స‌ముదాయాలు త‌ర‌లిపోతున్నాయి. ఇక్క‌డ  ఛాతీ ఆస్పత్రి మాత్రమే కాదు… ఆ పక్కనే ఉన్న మానసిక చికిత్సాలయం, ఆయుర్వేద ఆస్పత్రితోపాటు, ఇతర వైద్య సంస్థలూ తరలిపోనున్నాయి. చారిత్రక ప్రాధాన్యమున్న ఈ భవనాలన్నీ ఇక్క‌డ నుంచి వెళ్ళిపోతున్నాయి. దీనిపై  జీవో కూడా విడుద‌ల‌య్యింది. కొత్త సచివాలయం కోసం ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రిని వికారాబాద్‌ సమీపంలోని అనంతగిరికి తరలిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే… దీంతోపాటు మానసిక చికిత్సాలయం, ఆయుర్వేద […]

స‌చివాల‌యం నిర్మాణం పేరుతో ఎర్ర‌గ‌డ్డ‌లోని అనేక స‌ముదాయాలు త‌ర‌లిపోతున్నాయి. ఇక్క‌డ ఛాతీ ఆస్పత్రి మాత్రమే కాదు… ఆ పక్కనే ఉన్న మానసిక చికిత్సాలయం, ఆయుర్వేద ఆస్పత్రితోపాటు, ఇతర వైద్య సంస్థలూ తరలిపోనున్నాయి. చారిత్రక ప్రాధాన్యమున్న ఈ భవనాలన్నీ ఇక్క‌డ నుంచి వెళ్ళిపోతున్నాయి. దీనిపై జీవో కూడా విడుద‌ల‌య్యింది. కొత్త సచివాలయం కోసం ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రిని వికారాబాద్‌ సమీపంలోని అనంతగిరికి తరలిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే… దీంతోపాటు మానసిక చికిత్సాలయం, ఆయుర్వేద ఆస్పత్రికీ తరలింపు జ‌రిగిపోతుంది. నిజానికి… చెస్ట్‌ ఆస్పత్రి తరలింపుతోపాటే మానసిక చికిత్సాలయాన్ని కూడా తరలించాలని ప్రభుత్వం గతంలో భావించింది. అయితే… చెస్ట్‌ ఆస్పత్రి తరలింపుపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో తొలి జీవోలో ఇతర ఆస్పత్రులు, సంస్థల తరలింపు గురించి ప్రస్తావించలేదు. మార్చి 24వ తేదీన విడుదల చేసిన జీవోలో మాత్రం తమ ఆలోచనలను బయటపెట్టారు. మానసిక చికిత్సాలయం, ఆయుర్వేద ఆస్పత్రి, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యామ్లీ వెల్ఫేర్‌, డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిసే్ట్రషన్‌ స్థలాల్లో… ఎక్కడెక్కడ ఏం నిర్మిస్తున్నదీ వివరించారు. 55 ఎకరాలున్న మానసిక ఆస్పత్రి స్థలంలో ఐఏఎస్‌ క్వార్టర్స్‌ నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక్కడ ఐఏఎస్‌లకు ‘ఇండిపెండెంట్‌’ ఇళ్లను నిర్మించాలని భావిస్తున్నారు. ఆయుర్వేద ఆసుపత్రి, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌, డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేష‌న్ స్థలాల్లో కొత్త సచివాలయాన్ని నిర్మిస్తారు. చెస్ట్‌ ఆస్పత్రిని ఆనుకునే ఉన్న అత్యాధునిక వసతులతో కూడిన క్షయ పరీక్ష కేంద్రాన్ని కూడా తరలించనున్నారు. ఆయుర్వేద ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న ఆయుర్వేద వైద్య కళాశాల ఒక్క‌టి మాత్రం ప్ర‌స్తుతం త‌ర‌లింపుల జాబితాలో లేదు. దీనికి ముహూర్తం ఎప్పుడు పెడ‌తారో చూడాలి!-పీఆర్‌
First Published:  3 April 2015 8:57 PM GMT
Next Story