Telugu Global
National

తల్లి ప్రేమ క‌న్నా ప్ర‌పంచంలో గొప్ప‌దేముంటుంది?

ఇది త‌ర‌త‌రాలుగా వేస్తున్న ప్ర‌శ్న‌. కాని ఇంత‌వ‌ర‌కు స‌రైన స‌మాధానం రాలేదు. ఇక‌ ముందు కూడా రాదు. ఎందుకంటే ఎలాంటి ప్రేమా అమ్మ ప్రేమ ముందు సరితూగదు అంటారు. ఓ తల్లి తన కూతురి ప్రాణాలు కాపాడుకోవడానికి మొసలితో పోరాడింది. ఈ సంఘటన గుజరాత్‌లోని వడోదరా పడ్రా పట్టణం సమీపంలోని తికారియంబరక్ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే కాంతా వాకార్ అనే యువతి ఎప్పటిలాగే బట్టలు ఉతకడానికి విశ్వామిత్ర నదికి వెళ్లింది. ఇంతలో ఒక ముసలి అమాంతంగా […]

ఇది త‌ర‌త‌రాలుగా వేస్తున్న ప్ర‌శ్న‌. కాని ఇంత‌వ‌ర‌కు స‌రైన స‌మాధానం రాలేదు. ఇక‌ ముందు కూడా రాదు. ఎందుకంటే ఎలాంటి ప్రేమా అమ్మ ప్రేమ ముందు సరితూగదు అంటారు. ఓ తల్లి తన కూతురి ప్రాణాలు కాపాడుకోవడానికి మొసలితో పోరాడింది. ఈ సంఘటన గుజరాత్‌లోని వడోదరా పడ్రా పట్టణం సమీపంలోని తికారియంబరక్ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే కాంతా వాకార్ అనే యువతి ఎప్పటిలాగే బట్టలు ఉతకడానికి విశ్వామిత్ర నదికి వెళ్లింది. ఇంతలో ఒక ముసలి అమాంతంగా వచ్చి కాంతా వాకార్ కాలు పట్టుకొని నదిలోకి లాగింది. దీంతో అక్కడే ఉన్న ఆమె త‌ల్లి దీపాలి వెంటనే స్పందించి బట్టలు ఉతికే కర్రతో మొసలి తలమీద బలంగా ఓ 10 నిమిషాల పాటు కొడుతూనే ఉంది. దాంతో మొసలి కాంతా వాకార్ కాలు వదిలి నీటిలోకి జారుకుంది. గాయపడిన తన కుమార్తెను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించింది దీపాలి. చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పిన‌ట్లు… విశ్వామిత్ర నదిలో దాదాపు 260 మొసళ్లు ఉన్నాయని, నదిలో పరివాహక ప్రాంతంలో బట్టలు ఉతకవద్దని గ్రామస్తులకు అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.-పీఆర్‌

First Published:  4 April 2015 12:10 PM GMT
Next Story